international

జ‌ర్మ‌నీ నుంచి మిస్సైల్స్ కొంటున్న పాకిస్థాన్‌.. అయినా భార‌త్‌కు ఢోకా లేదా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువ పబ్లిసిటీ లేకుండా జర్మనీ వారు పాకిస్తాన్ కి IRIS -T &lpar; Infrared Imaging system tail&sol;thrust vector controlled &rpar; short to medium క్షిపణి విధ్వంసక వ్యవస్థని అమ్మాలని ప్రయత్నిస్తున్నారు&period; ఈ వ్యవస్థ ఉక్రెయిన్ ఉపయోగించి&comma; రష్యా ప్రయోగించిన కొన్ని P800 oniks క్షిపణులను &lpar; ఈ క్షిపణి&comma; బ్రహ్మోస్ క్షిపణి కి&comma; అప్ప చెల్లి పిల్లల సంబంధం ఉంది&rpar; నిలువరించింది అని&comma; పాకిస్తాన్ దీనిని పొందడం సరైన నిర్ణయం అని జర్మనీ ఈ వ్యస్థను అమ్మకానికి ఉంచినట్టు సమాచారం&period; IRIS -T launcher లో 8 క్షిపణులు ఉంటాయి&period; శత్రువుల క్షిపణిని నిలువరించడానికి అవసరమైతే మొత్తం 8 క్షిపణులను 30 సెకండ్ల వ్యవధిలో ప్రయోగించగలదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వేళ ఈ సిస్టమ్ పాకిస్తాన్ చేతిలోకి వచ్చినా&comma; మనం క్రింది విషయాలు గుర్తు ఉంచుకోవాలి&period; టర్కీ&comma; చైనా గగన తల రక్షణ వ్యవస్థలు బ్రహ్మోస్&sol;P800 దాని బంధువులకు సంబంధించిన ఒక్క క్షిపణిని కూడా నిలువరించి న చరిత్ర లేదు&period; వాటి తో పోలిస్తే జర్మనీ ప్రతిపాదించిన వ్యవస్థ కి &comma; వాటిని కొన్ని అయినా విజయవంతం గా ఎదుర్కున్న చరిత్ర ఉంది కాబట్టి అది పాకిస్తాన్ రక్షణ ను మెరుగు పరుస్తోంది&period; ఐతే&comma; ఈ సిస్టమ్ success rate minimal గానే ఉంది&period; రష్యా ప్రయోగించిన P800 క్షిపణులను చేతితో లెక్క పెట్టగలిగిన అన్ని &lpar; సింగిల్ డిజిట్ &rpar; మాత్రమే అడ్డుకుంది&period; మిగతా వాటిని వివిధ కారణాల వల్ల అడ్డుకోలేకపోయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87781 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;iris-t&period;jpg" alt&equals;"pakistan buying missiles from germany " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">P 800 నేల పై నుంచి ప్రయోగించే క్షిపణి&period; బ్రహ్మోస్ నేలపై నుంచే కాక&comma; యుద్ద విమానం నుంచీ కూడా ప్రయోగించవచ్చు&period; అలా యుద్ద విమానం నుంచీ ప్రయోగించిన దాన్ని అడ్డుకోవడం ఇంకా కష్టం &lpar; altitude&comma; speed కారణం గా&rpar;&period; P 800 కన్నా బ్రహ్మోస్ &comma; నావిగేషన్&comma; stealth&comma; accuracy మెరుగైనవి&period; ఈలోపు మనం సూపర్ సోనిక్ నుంచీ హైపర్సోనిక్ బ్రహ్మోస్ కి మారితే&comma; మన పై చేయి అలాగే ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts