చాలామందికి పెద్ద జాబ్ చేయడం కల. ఇస్రోలో పనిచేయడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి..? జీతం ఎంత వస్తుంది అనే దాని గురించి ఇప్పుడే చూద్దాం. మెడికల్ ఆఫీసర్- SD, సైంటిస్ట్ ఇంజనీర్ – SC, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ – B, డ్రాఫ్ట్స్‌మన్ – B అలాగే అసిస్టెంట్ (అధికారిక భాష) పోస్టుల కోసం ఇస్రో ఖాళీలను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అక్టోబర్ 9 లోగా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 103 పోస్టులను భర్తీ చేస్తారు.
ఏ వయస్సు వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది చూస్తే.. మెడికల్ ఆఫీసర్ (SD) పోస్టులకి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉండాలి. మెడికల్ ఆఫీసర్ (SC) – 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు, సైంటిస్ట్ ఇంజనీర్ (SC) – 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు, టెక్నికల్ అసిస్టెంట్ – 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు, సైంటిఫిక్ అసిస్టెంట్ – 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు.
టెక్నీషియన్ (బి) – 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు, డ్రాఫ్ట్స్‌మన్ (బి)- 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు, అసిస్టెంట్ (అధికారిక భాష)- 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాలు. SC మరియు ST అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 5 సంవత్సరాలు. OBC అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 3 సంవత్సరాలు. శాలరీ విషయానికి వస్తే.. రూ. 21700 నుండి రూ. 208700 మధ్య జీతం వస్తుంది.