రామాయణంలో ఉండే రావణాసురుడి గురించి అందరికీ తెలిసిందే. ఇతను ఓ రాక్షసుడు. జనాలను పట్టి పీడిస్తుండేవాడు. రాముడి భార్య సీతను అపహరించుకుని లంకకు తీసుకెళ్లిన క్రూరుడు ఇతను. రావణుడి గురించి చాలా మందికి ఇదే తెలుసు. అతను ఓ రాక్షసుడని, అందరినీ హింసిస్తాడనే చాలా మంది చదివారు. కానీ నిజానికి రావణాసురుడి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా అతనిలో అన్ని గుణాలు ఉన్నాయా..? అనిపిస్తుంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా. రావణుడికి 10 తలలు ఉంటాయి కదా. అందుకే అతనికి అన్ని అంశాల్లో ప్రతిభా పాటవాలు ఉంటాయట. చాలా తెలివిమంతుడట. సకల శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, విద్యల గురించి అతనికి తెలుసుట. అతను విద్యా పారంగతుడని చెబుతారు.
జైన రామాయణంలో సీత రావణుడి కూతురని చెప్పబడింది. రావణాసురుడు సొంత మేథాశక్తితో పుష్పక విమానాన్ని తయారు చేశాడట. శాస్త్ర, విజ్ఞాన రంగాల్లో అతను ఆరితేరి ఉండడం వల్లే దాన్ని అతను తయారు చేశాడని చెబుతారు. దుస్తులు, అలంకరణలపై రావణుడికి ప్రత్యేక ఇష్టాలు ఉంటాయట. స్త్రీలు కూడా అతను అలంకరణ అయినట్టు కాలేరట. అంతగా అవి అంటే రావణుడికి అభిమానమట. ఇప్పుడు సంగీత కారులు వాడుతున్న వీణను అప్పట్లో రావణాసురుడే తయారు చేశాడట. దాని పేరు రుద్ర వీణ. కులాలకు రావణాసురుడు వ్యతిరేకమట. తన రాజ్యంలో ప్రజలందరిదీ ఒకే కులం అని రావణుడు అనే వాడట.
ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాల్లో రావణాసురుడు దిట్ట అట. ఆయా శాస్త్రాలను అవపోసిన పట్టిన కొద్ది మందిలో రావణుడు కూడా ఒకరని చెబుతారు. జనాలను హింసించడంలో రావణుడు ముందుండే వాడు కానీ, సొంత కుటుంబ సభ్యులను మాత్రం చాలా ప్రేమగా చూసేవాడట. పరమ శివుడికి ఉన్న గొప్ప భక్తుల్లో రావణుడు ముందు వరుసలో ఉంటాడు. శివున్ని ఆరాధించడం అంటే రావణుడికి చాలా ఇష్టమట. రావణుడి వద్ద సీత కొన్ని నెలల పాటు ఉంటుంది కదా. ఆ తరువాత రాముడు రావణున్ని చంపి ఆమెకు అగ్ని పరీక్ష పెట్టి స్వీకరిస్తాడు. అయితే రావణుడి భార్య మండోదరిని వానర సేనలు వేధిస్తాయట. అయినప్పటికీ రావణుడు తన భార్యకు ఎలాంటి పరీక్ష పెట్టకుండానే స్వీకరిస్తాడట. మన దేశంతోపాటు శ్రీలంకలోనూ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ రావణున్ని పూజిస్తారు. దైవంగా ఆరాధిస్తారు.