ఇన్సులిన్, సిరంజీలు విమాన ప్రయాణంలో మీతో పాటు తీసుకు వెళ్ళాలంటే డాక్టర్ వద్దనుండి మీరు డయాబెటిక్ రోగి అని ధృవపరుస్తూ ఒక సర్టిఫికేట్ తీసుకు వెళ్ళవలసి వుంటుంది. ఇన్సులిన్ డయాబెటీస్ రోగులు విదేశాలకు వెళ్ళేటపుడు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఎయిర్ లైన్ భధ్రతా సిబ్బంది ఉన్నప్పటికి డయాబెటీస్ రోగులు తమ ఇన్సులిన్ ను చేతి లగేజీలో చేర్చి తీసుకు వెళ్ళ వచ్చు. అయితే, డాక్టర్ ఇచ్చిన లెటర్ అత్యవసరం.
ఆ లెటర్ లో మీరు ఇన్సులిన్, సిరంజీలు, ఇన్సులిన్ పంప్ వంటివి విమాన ప్రయాణంలో అవసరమని పేర్కొనాలి. డాక్టర్ నుండి పొందిన ఆ లెటర్ ను మీరు భధ్రతా సిబ్బందికి అందించండి. మీకు వీటిని తీసుకు వెళ్ళటంలో ఏవైనా సమస్యలు తలెత్తితే, సిబ్బందిలోని ఒక సీనియర్ మేనేజర్ తో మాట్లాడాలి. సాధారణంగా ఇన్సులిన్ మీతో తీసుకు వెళ్ళడం పెద్ద సమస్య కాకపోవచ్చు.
ఇన్సులిన్, సిరంజి వంటివి మీతోనే వుండాలి. వాటిని సాధారణ లగేజీతో వేస్తే ఎయిర్ లైన్స్ అధికార్లు బ్యాగులు ఫ్రీజ్ చేసే అవకాశం వుంటుంది. అటువంటపుడు ఇన్సులిన్ ను గాలి చొరని డబ్బాలో పెట్టి తీసుకు వెళ్ళాలి. సాధారణంగా కేబిన్ సిబ్బంది మందులను నిలువ చేయటానికి తమకు ఇవ్వవలసినదిగా కోరతారు. కనుక డాక్టర్ వద్దనుండి సర్టిఫికేట్ వుంటే మీకు అది పెద్ద సమస్య కాబోదు. అయినప్పటికి మీరు ప్రయాణించే ఎయిర్ లైన్స్ పాలసీ ఏమిటో తెలుసుకొని ప్రయాణించండి.