lifestyle

Life Tips : పెళ్లి తరువాత ప్రేమ తగ్గిపోయిందా.. అయితే ఇలా చేస్తే.. దంప‌తులు అన్యోన్యంగా ఉంటారు..

Life Tips : సాధార‌ణంగా జంట‌లు పెళ్లికి ముందు ఒకరిపై ఒకరు చాలా ప్రేమ చూపించుకుంటారు. ఒకరి గురించి ఒకరు తలుచుకుంటూ వాళ్ల ధ్యాస‌లోనే గడిపేస్తుంటారు. నిజానికి ఒకరితో ప్రేమలో పడేది కూడా వాళ్లు మనపై చూపించే కేర్ ను చూసే. కానీ పెళ్లి తరువాత చాలా జంటలు తమ జీవిత భాగస్వాములు మారిపోయారంటూ గొడవలు పడుతుంటారు. కొంతమంది అయితే ఏకంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. అయితే అలా జరగకుండా ఉండాల‌న్నా.. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోవద్ద‌ని అనుకున్నా.. అందుకు కొన్ని సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. నిపుణులు వీటిని చెబుతున్నారు. అవేమిటంటే..

ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఒకరికొకరు ప్రేమతో గుడ్ మార్నింగ్ లాంటివి చెప్పుకోవాలి. అంతేకాకుండా కలిసి టీ తాగడం, టిఫిన్ చేయడం లాంటివి చేయడంతో రోజు ప్రారంభమవుతుంది. అలా కలిసి ఉదయాన్నే టీ తాగుతూ ప్రశాంతంగా మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుంది. భార్యాభర్తలు ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో కలిసి టీవీ చూడడం, సినిమాలు చూడటం లాంటివి చేయడం వల్ల ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడిపినట్టు అవుతుంది. దాని వల్ల కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.

couple who want to love again follow these tips

ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని అనిపించినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడం వల్ల బంధం బలపడుతుంది. భార్యకు భర్త ఇంటి పనుల్లో సాయం చేయడం, అదేవిధంగా భర్త ఆఫీసుకు వెళ్లే సమయంలో భార్య అతడి దుస్తులను ఇస్త్రీ చేయించడం లాంటివి చేయటం వల్ల ఒకరిపై ఒకరికి మరింత ప్రేమ పెరుగుతుంది. ఇద్ద‌రూ ఒక‌రి అభిప్రాయాల‌ను ఒక‌రు గౌర‌వించ‌డంతోపాటు ఒక‌రి ఇష్టాల‌ను మ‌రొక‌రు కాద‌న‌క‌పోవ‌డం, క‌ల‌సి బ‌య‌ట‌కు వెళ్ల‌డం, స‌ర‌దాగా విహ‌రించ‌డం.. వంటివి చేస్తే దంప‌తుల మ‌ధ్య క‌చ్చితంగా ప్రేమ పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే దంప‌తులు అన్యోన్యంగా ఉంటార‌ని అంటున్నారు.

Admin

Recent Posts