lifestyle

ఉదయం అలారం మోగినప్పుడు..ఆపేసి మళ్లీ పడుకుంటున్నారా..? అయితే ఈ బాడీ-మైండ్ డిస్కషన్ మీకోసమే..!

(నిద్రపోవాలనుకున్నప్పుడు):

మనిషి: రేపు తొంద‌ర‌గా మేల్కొవాలి.!

మనసు: అవును మేల్కోవాలి.

(తెల్లవారుతున్నప్పుడు)

మనిషి: సమయం 4 గంటలూంది…,నిద్ర లేవాలి.

మనసు: నాకు ఇంకాస్త నిద్ర కావాలి.!

మనిషి: అవును …. కావాలి….గుర్ర్…గుర్ర్….గుర్ర్..!!!

(5 గంట‌ల‌కు).

మనిషి: మేలుకో..మేలుకో….

మనసు:వద్దు..వద్దు..

మనిషి: లేదు..నాకు 8 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోవ‌డం ఇష్టం లేదు. నాకు చాలా పనులు ఉన్నాయి, త్వరగా టిఫిన్ చేయాలి, ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి, నా సమయాన్నిట్రాఫిక్ లో వృథా చేయను.

మనసు: సరే..సరే,,, మేలుకో…!

discussion between mind and body when stopping alaram clock

చూశారా! మొద‌ట్లో మ‌నిషిని డ్యామినేట్ చేయాల‌ని చూసిన మ‌న‌సు , త‌ర్వాత కృత‌నిశ్చ‌యంతో ఉన్న మ‌నిషి మాట విన్నది.! ఒక‌వేళ ఈ సంద‌ర్భంలో…స‌రే అని మ‌న‌సు మాటే విన్న‌మానుకోండి మ‌న ప‌త‌నం అక్క‌డి నుండే స్టార్ట్ అవుతుంది.!! అంటే మనం మనసును స్వాధీనములో ఉంచుట‌కు…. సాకులకు బదులుగా సానుకూల సమాధానాలు చెప్పుకుని , సాధించాల్సిన విష‌యాల‌ను గురించి ప్ర‌స్తావించుకుంటూ మ‌న మ‌న‌స్సును కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి.! లేదంటే మాన‌వ జీవితం గ‌తి త‌ప్పుతుంది, మ‌న‌స్సు మ‌న‌ల్ని పిచ్చోల్లుగా చిత్రీక‌రిస్తుంది.! మాన‌వ సంక‌ల్పం ముందు ఎలాంటి ప‌వ‌ర్స్ అయినా దిగ‌దుడుపే.!!

Admin

Recent Posts