చాలా మంది తమ జీవితాలను సంతోషాన్ని వెతకడం కోసమే డెడికేట్ చేస్తారు. అప్పుడప్పుడు, కొందరు వ్యక్తుల ద్వారా జీవితం పరమార్థం అర్థమై కానట్టు అనిపిస్తూ ఉంటుంది. మీనింగ్ ఫుల్ గా జీవితాన్ని లీడ్ చేయాలంటే హ్యాపీగా ఉండటం మాత్రమే కాదు అంతకు మించి అనంటున్నారు నిపుణులు. ఎన్నో రీసెర్చ్ లు అలాగే స్టడీస్ తరువాత లైఫ్ ను మీనింగ్ ఫుల్ గా ఎలా లీడ్ చేయాలో చెబుతున్నారు వారు. మొదటి పిల్లర్ బిలాంగింగ్. రిలేషన్షిప్ కి సంబంధించిన పిల్లర్ ఇది. ఏ విషయంలో మీకు ఇతరులు వాల్యూ ఇస్తారు, అలాగే మీరు ఏ విషయంలో ఇతరులకు వాల్యూ ఇస్తారు, అన్న దానిపై ఈ పిల్లర్ ఆధారపడి ఉంది. చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాల వల్ల ఇతరులను రిజెక్ట్ చేస్తాం. అలా చేయడం వల్ల మన వాల్యూ తగ్గిపోతుంది అన్న విషయాన్ని నిజానికి గుర్తించకుండానే ఇలా ప్రవర్తిస్తాం. చాలా మందికి బిలాంగింగ్ అనే పిల్లర్ నేర్చుకునేందుకు ముఖ్యమైన సోర్స్.
రెండవ పిల్లర్ పర్పస్. పర్పస్ అనేది మీకు కావాల్సిన దానికంటే మీరు ఇవ్వవలసిన దానిపై ఫోకస్ పెట్టాల్సిన పిల్లర్. పర్పస్ అనేది మీ జీవితానికి ఒక అర్థాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకు అనే ప్రశ్న మనల్ని ముందుకు తీసుకువెళుతుంది. మూడవ పిల్లర్ అనేది మిమ్మల్ని మీరు అధిగమించే దశ అనంటున్నారు నిపుణులు. అంటే, జీవితానికి అర్థం రావాలంటే మిమ్మల్ని మీరు అధిగమించడం నేర్చుకోవాలి. ట్రాన్సెండెంట్ స్టేట్ అని దీన్నంటున్నారు. రోజువారీ హడావిడి జీవితంలో మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు. మిమ్మల్ని మీరు మరచిపోతున్నారు. మీతో మీరు కనెక్ట్ అవడమే రియాలిటీ అంటున్నారు నిపుణులు.
నాలుగవ పిల్లర్ అందరినీ ఆశ్చర్యపరచవచ్చు. నాలుగవ పిల్లర్ పేరు స్టోరీ టెల్లింగ్. మీ గురించి మీరు చెప్పుకునే స్టోరీనే స్టోరీ టెల్లింగ్. మీరు మీరుగా మారడానికి దారితీసిన విషయాల్ని మీకు వివరించేందుకు ఈ పిల్లర్ హెల్ప్ చేస్తుంది.