కౌన్ బనేగా కరోడ్ పతి.. దీన్నే కేబీసీ అని కూడా అంటారు. మన చిన్నతనం నుంచే ఈ ప్రోగ్రామ్ వస్తోంది. కానీ దీనికి హోస్ట్‌లే మారుతున్నారు. ఇక ఈ షోకు ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో సీజన్లను పూర్తి చేసుకున్న కౌన్ బనేగా కరోడ్‌పతి ఇప్పుడు 16వ సీజన్ నడుస్తోంది. ఈ మధ్యే ఆగస్టు 12న ఈ సీజన్‌ను ప్రారంభించారు.
ఇక ఈ సీజన్‌కు గాను చందర్ ప్రకాష్ అనే వ్యక్తి రూ.1 కోటి గెలుచుకున్నాడు. అతను రూ.7 కోట్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేక షో నుంచి ఎగ్జిట్ అవడంతో అతనికి రూ.1 కోటి వచ్చాయి. అయితే జనరల్‌గా ఇలాంటి షోలలో పాల్గొంటే గెలుచుకునే నగదుకు గాను అసలు మనకు చేతికి ఎంత అందుతుంది ? ఎంత మొత్తాన్ని మనం ట్యాక్స్ రూపంలో కోల్పోతాం ? వంటి సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. ఇక అందుకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేబీసీ లాంటి షోలలో రూ.1 కోటి గెలుచుకుంటే అందులో 30 శాతం టీడీఎస్ పోతుంది. అంటే రూ.1 కోటిలో రూ.30 లక్షలను టీడీఎస్ కింద చెల్లించాలన్నమాట. అలాగే టీడీఎస్ మీద మళ్లీ 10 శాతం సర్ చార్జి చెల్లించాలి. ఇది మరో రూ.3 లక్షలు అవుతుంది. ఇక ఈ మొత్తం.. అంటే రూ.33 లక్షల మీద మళ్లీ 4 శాతం సెస్ విధిస్తారు. ఇది మరో రూ.1.32 లక్షలు అవుతాయి. అంటే మొత్తం రూ.34.32 లక్షలు అన్నమాట. ఈ మొత్తాన్ని రూ.1 కోటి లోంచి తీసేస్తే అప్పుడు చేతికి రూ.65.68 లక్షలు వస్తాయి. అయితే ఐటీ రిటర్న్స్ వేసే వారు పక్కాగా రిటర్న్స్ వేస్తే ఆ కట్ అయ్యే మొత్తాన్ని కూడా మళ్లీ రీఫండ్ రూపంలో ఇన్‌కమ్‌ట్యాక్స్ నుంచి పొందవచ్చు. ఇలా ఈ షోలలో గెలుచుకునే మొత్తాలపై మన మీద ట్యాక్స్ వేసి వసూలు చేస్తారన్నమాట. కానీ తెలివి ఉంటే ఆ కట్ అయిన దాన్ని కూడా మనం రీఫండ్ పొందవచ్చు.