lifestyle

కొబ్బ‌రి బొండాంను మీద నుంచి చూసే ఎందులో నీళ్లు ఎక్కువ ఉంటాయో ఎలా చెప్ప‌వ‌చ్చో తెలుసా..?

కొబ్బరి బోండం ఆకారం చూసి లేదా పట్టుకుని ఊపినప్పుడు మనం దాంట్లో నీళ్లు ఎన్ని ఉంటాయో సులభంగా కనుక్కోవచ్చు. దీనికి నేను నా స్వానుభవాన్ని బట్టి సమాధానం ఇస్తున్నాను. వీటిని ఎర్రనీళ్ళ కొబ్బరి బోండం అంటారు మా వైపు. ఇందులో నీళ్లు తియ్యగా, నిండుగా ఉంటాయి మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాస్త సన్నగా, పొడవుగా ఉన్న కొబ్బరి బోండంలో నీళ్లు కాస్త తక్కువగా ఉంటాయి కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.

గుండ్రంగా ఉన్న కొబ్బరి కాయల్లో నీళ్లు ఎక్కువ ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే ఊపితే సరిపోతుంది. ఈ కాయను ఊపినప్పుడు శబ్దం రాకుండా ఉంటే అందులో నిండుగా నీళ్లు ఉన్నట్లు అర్థం. ఒకవేళ శబ్దం వస్తే నీళ్లు తక్కువగా ఉన్నట్లు అర్థం. కాయ మొత్తం పచ్చగా, కాస్త చిన్నదిగా ఉంటే అది లేత కొబ్బరి బోండం అని, కొంచెం పెద్దగా ఉండి, రంగు కాస్త తిరిగి ఉంటే ముదురు బోండం అంటారు.

how to identify which coconut has more water

ఎండు కొబ్బరి బోండాలు కూడా ఉంటాయి. వీటిలో సాధారణంగానే నీళ్లు తక్కువగా ఉంటాయి. కాకపోతే కొన్నింటిలో అసలు నీళ్లు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు తెలుసుకోవాలంటే ఊపితే సరిపోతుంది.

Admin

Recent Posts