lifestyle

Dishti For Children : చిన్నారుల‌కు దిష్టి ఎలా తీయాలో తెలుసా..? ఇలా చేయండి..!

Dishti For Children : మ‌నుషుల‌కు దిష్టి త‌గ‌ల‌డం అన్నది స‌హ‌జం. చిన్నా పెద్దా ఎవ‌రికైనా స‌రే అప్పుడ‌ప్పుడు దిష్టి త‌గులుతుంది. ఒక్కోసారి మ‌న సొంత లేదా మ‌న ఇంట్లో ఉండే వారి దిష్టే మ‌న‌కు త‌గులుతుంది. మ‌న‌ల్ని మ‌నం చూసి మురిసిపోయినా.. గొప్ప‌గా ఫీలైనా.. అందంగా ఉన్నామ‌ని కామెంట్స్ చేసినా.. దిష్టి త‌గులుతుంది. తినేట‌ప్పుడు అదే ప‌నిగా చూసినా కూడా దిష్టి త‌గులుతుంది. అయితే చిన్నారులు చాలా ముద్దుగా ఉంటారు క‌నుక వారికి త‌ర‌చూ దిష్టి త‌గులుతుంది. కానీ వారికి పెద్ద‌ల‌కు తీసిన‌ట్లు దిష్టి తీయ‌కూడ‌దు. అందుకు భిన్న‌మైన ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంబించాల్సి ఉంటుంది. ఇక చిన్నారుల‌కు దిష్టి ఎలా తీయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్నారుల‌కు క‌ర్పూరంతో దిష్టి తీయాల్సి ఉంటుంది. సాధార‌ణంగా పెద్ద‌ల‌కు అయితే ఉప్పు లేదా చీపురుతో దిష్టి తీస్తారు. కానీ చిన్నారుల‌కు క‌ర్పూరంతో దిష్టి తీయాలి. క‌ర్పూరం బిళ్ల‌లు 3 తీసుకుని ఒక ప‌ళ్లెంలో వేసి చిన్నారుల‌కు దిష్టి తీయాలి. మూడు సార్లు తిప్పాక క‌ర్పూరాన్ని ఎవ‌రూ తొక్క‌ని చోట ప‌డేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కర్పూరం క‌రిగిపోతుంది. క‌ర్పూరం క‌రిగే కొద్దీ దిష్టి పోతుంద‌ని అర్థం. ఇలా చిన్నారుల‌కు దిష్టి తీయాల్సి ఉంటుంది. ఇక చిన్నారుల‌కు సుల‌భంగా దిష్టి త‌గులుతుంది క‌నుక వారి కాళ్ల‌కు, చేతుల‌కు న‌ల్ల‌ని దారాల‌ను క‌ట్టాలి. అలాగే త‌ల‌పై, బుగ్గ‌పై కాటుక చుక్క‌లు పెట్టాలి. అర చేతిలో, అరికాలిలోనూ కాటుక చుక్క‌లు పెట్టాలి.

how to take dishti for kids

చిన్నారుల‌కు దిష్టి త‌గిలితే న‌ల‌త‌గా ఉంటుంది. జ్వ‌రం వ‌స్తుంది. ఏమీ తిన‌రు. ఇలాంట‌ప్పుడు దిష్టి త‌గిలి ఉంటుంద‌ని భావించాలి. వెంట‌నే రాళ్ల ఉప్పుతో మూడు సార్లు దిష్టి తీయాలి. త‌రువాత ఆ ఉప్పును నీటిలో క‌లిపేయాలి. ఇక కొద్దిగా అన్నం వండి అందులో ప‌సుపు, కుంకుమ క‌లిపి ముద్ద‌లా చేసి కూడా దిష్టి తీయ‌వ‌చ్చు. అయితే దీన్ని ఎవ‌రూ చూడ‌ని ప్ర‌దేశంలో ప‌డేయాలి. ఇలా చిన్నారుల‌కు దిష్టి తీయ‌వ‌చ్చు. దీంతో వారిపై చెడు చూపు ప‌డ‌కుండా ఉంటుంది. వారు ఆరోగ్యంగా ఉంటారు.

Admin

Recent Posts