lifestyle

భ‌ర్త మోసం చేస్తున్నాడా, లేదా అన్న‌ది భార్య‌లు ఈ 4 సంద‌ర్భాల‌ను బ‌ట్టి తెలుసుకోవ‌చ్చు..!

ఒక వ్య‌క్తి మ‌న‌ల్ని మోసం చేస్తున్నాడా ? లేదంటే అత‌ను నిజ‌మే చెబుతున్నాడా ? అనే విష‌యాల‌ను ఈ ప్ర‌పంచంలో ఎవ‌రూ తెలుసుకోలేరు. అలా తెలుసుకోవాలంటే స్వ‌యంగా ఆ వ్య‌క్తే నేను నిన్ను మోసం చేస్తున్నా ! అని చెప్పాలి. లేదంటే అత‌ను ఆ విష‌యం వేరే ఎవ‌రికైనా చెబితే తప్ప వారి ద్వారా మ‌న‌కు అది తెలియ‌దు. అయితే ఎవ‌రో వ్య‌క్తుల‌కు సంబంధించిన విష‌యం ఏమో గానీ.. భార్య‌లు స్వ‌యానా త‌మ భ‌ర్త త‌మ‌ల్ని మోసం చేస్తున్నాడా ? లేదా ? అనే విష‌యాన్ని మాత్రం సుల‌భంగా తెలుసుకోవ‌చ్చ‌ట‌.

అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. అయితే ఇందుకు టిప్స్, ట్రిక్స్ ఏమీ ఉండ‌వు. కాక‌పోతే వారు చెప్పే సమాధానాన్ని బ‌ట్టి వారు మోసం చేస్తున్నారా, లేదా అన్న‌ది తెలుసుకోవ‌చ్చు. అందుకు గాను కింద ఇచ్చిన ప‌లు ఎగ్జాంపుల్స్ ప‌నికొస్తాయి. వీటిని ఓ ఫేమ‌స్ డిటెక్టివ్ చెప్పారు. ఈ 4 సంద‌ర్భాల్లో భార్య‌లు త‌మ భ‌ర్త‌లను ఈ ప్ర‌శ్న‌లు అడగండి. అప్పుడు వారు చెప్పే స‌మాధానాల‌ను బ‌ట్టి వారు మోసం చేస్తున్నారా, లేదా అన్న‌ది ఈజీగా క‌నిపెట్ట‌వ‌చ్చు. మ‌రి ఆ సంద‌ర్భాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

husband cheating wife here how anyone can identify it

సంద‌ర్భం – 1

మీ భ‌ర్త ఎప్ప‌టిలా సాదీసీదాగా కాకుండా మంచి స్టైల్‌గా, కొత్త బ‌ట్ట‌లు వేసుకుని, సెంట్ కొట్టుకుని ఫ్యాష‌న్ గా బ‌య‌ట‌కు వెళ్తుంటే అప్పుడు అడ‌గండి. మీకు ఈ రోజు ఏదైనా ముఖ్య‌మైన మీటింగ్ ఉందా ? అంటే.. అందుకు భ‌ర్త సూటిగా స‌మాధానం చెప్ప‌డు. ఆ.. అవును, అలాంటిదే ఉంది. అని ముక్త‌స‌రిగా స‌మాధానం చెబుతాడు. దీన్ని బ‌ట్టి అది చీటింగా, కాదా అన్న‌ది తెలుస్తుంది.

సంద‌ర్భం – 2

మీ ఫోన్ నేను వాడుకోవ‌చ్చా ? అని అడగండి. అందుకు మీ భ‌ర్త తీసుకో అని చెబితే ఓకే. అలా కాకుండా .. లేదు, నా ఫోన్ ట‌చ్ చేయ‌కు అని చెబితే క‌చ్చితంగా మోసం చేస్తున్న‌ట్టే లెక్క‌.

సంద‌ర్భం – 3

మీ భ‌ర్త బాగా మూడీగా ఇంటికి వ‌స్తే.. ఏంటీ, ఆఫీసులో ఏమైనా జ‌రిగిందా ? అని అడ‌గండి. అప్పుడు అత‌ను.. అవును, నా కొలీగ్‌తో గొడ‌వ ప‌డ్డా, నా బాస్ అరిచారు.. లాంటి స‌మాధానాలు చెబితే ఓకే. అవి కాకుండా.. ప్ర‌శ్న‌లు వేసి ఎందుకు న‌న్ను విసిగిస్తున్నావు ? అంటే అప్పుడు అనుమానించాల్సిందే.

సంద‌ర్భం – 4

మీరు మీ భ‌ర్త‌ను.. సినిమాకు వెళ్దామా ? అని అడగండి. అందుకు అత‌ను అవును, కాదు అని చెబితే ఓకే. అలా కాకుండా.. లేదు.. నాకు వేరే ప‌ని ఉంది.. అని చెబితే అప్పుడు చీటింగ్‌గా అనుమానించాలి. ఆ సంద‌ర్భంలో భ‌ర్త మిమ్మ‌ల్ని మోసం చేస్తున్న‌ట్టు గ్ర‌హించాలి.

Admin

Recent Posts