Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

తలస్నానానికి షాంపూలను, వేడినీళ్లను వాడుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఈ విషయాలు తెల్సుకోండి.

Admin by Admin
April 20, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మహిళలు, ముఖ్యంగా యువతులు తమ శిరోజాలు ఒత్తుగా, పొడవుగా పెరగాలని కోరుకోవడం సహజం. ఎందుకంటే ఒత్తుగా, ప్రకాశవంతంగా ఉండే తల వెంటుక్రలతో మేనికి అందం కూడా వస్తుంది. కానీ అవి కేవలం ఒకే రాత్రిలో పెరగలేవుగా! వాటి పట్ల ఎప్పటికప్పుడు సంరక్షణ వహిస్తూ, జాగ్రత్తగా చూసుకుంటేనే అవి త్వరగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. మనిషి తల వెంట్రుకలు నెలకు అరంగుళం చొప్పున పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే 16 అంగుళాల పొడవు పెరగాలంటే అందుకు దాదాపు 32 నెలల సమయం పడుతుంది. అయితే అధిక శాతం మంది తమ జుట్టుపై శ్రద్ధ వహించక నిర్లక్ష్యం చేస్తారు. దీంతో జుట్టు చిట్లడమో, పొడిబారడమో జరిగి పెరుగుదల కూడా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే శిరోజాలు బాగా పెరగాలంటే కొన్ని సింపుల్ టిప్స్‌ను పాటిస్తే సరిపోతుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తల వెంట్రుకలు పొడవుగా పెరగాలని కోరుకునే వారు కెమికల్స్ లేని షాంపూ, కడిషనర్‌లను వాడాలి. సల్ఫేట్స్, సిలికాన్, ఎస్‌ఎల్‌ఎస్ వంటి పదార్థాలు ఉన్న షాంపూలు, కండిషనర్లు అస్సలు వాడకూడదు. తల వెంట్రుకలను సంరక్షించుకోవాలంటే వారానికి కనీసం 2 నుంచి 3 సార్లు తలస్నానం చేయాలి. అతి ఎక్కువగా కూడా తలస్నానం చేయకూడదు. ఇది వెంట్రుకలను చిట్లిపోయేలా చేస్తుంది. తలస్నానానికి ఎల్లప్పుడూ చల్లని నీటినే వాడాలి. ఎందుకంటే వేడి నీటి వల్ల వెంట్రుకలు విరిగిపోయే విధంగా మారతాయి. వెంటుక్రలు తడిగా ఉన్నప్పుడు తల దువ్వకూడదు. ఇది జుట్టును బలహీనంగా చేసి వెంట్రుకల చివర్లను పగిలిపోయేలా చేస్తుంది. అదేవిధంగా కఠినంగా ఉండే దువ్వెనలు కాకుండా వెంట్రుకలపై సాఫ్ట్‌గా ఉండే దువ్వెనలనే తల దువ్వుకునేందుకు ఉపయోగించాలి.

if you are doing head bath follow these tips

జుట్టును ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. దీంతో వెంట్రుకల చివరన ఉండే పగుళ్లు తొలగిపోతాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టును సంరక్షించుకోవాలంటే మరో ముఖ్యమైన సూచన సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం. ప్రధానంగా చేపలు, పండ్లు, కూరగాయలు, నట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే జుట్టు ఎక్కువగా పెరుగుతుంది. రోజూ కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. ఇది శరీరాన్ని డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది. లేదంటే డీహైడ్రేషన్ కారణంగా వెంట్రుకలు తమ సహజ మృదుత్వం కోల్పోయి పొడిగా మారతాయి.

Tags: head bath
Previous Post

వాష్ బేసిన్ సింక్ జామ్ అయిందా..? అయితే ఈ సింపుల్ ట్రిక్‌తో సింక్‌లోని అడ్డంకిని తొల‌గించుకోవ‌చ్చు..!

Next Post

బెడ్‌పై ప‌డుకున్నాక కేవ‌లం 60 సెకండ్ల‌లోనే నిద్ర‌లోకి జారుకునే ట్రిక్ ఇదిగో..!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.