lifestyle

పీడ‌క‌ల‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా..? అయితే ఈ టిప్స్‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్నిసార్లు చెడు కలలు ఒక వ్యక్తిని ఎంతగా బాధపెడతాయంటే అది అతని దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది&period; నిద్రలో వచ్చిన ఈ కలలు మేల్కొన్న తర్వాత కూడా మెదడు&comma; మనసుపై చెరగని ముద్ర వేస్తాయి&period; ఈ జీవిత మంత్రాలు పాటించారంటే మాత్రం చెడు కలలు మిమ్మల్ని ఎప్పుడూ బాధించవు&period; నిద్రపోతున్నప్పుడు కలలు రావడం సర్వసాధారణం&period; రకరకాల కారణాల వల్ల విభిన్నమైన స్వప్నాలు పుట్టుకొస్తాయి&period; కలల్లో విహరించేటప్పుడు అదంతా నిజమేనేమో అని భ్రమపడని వారు తక్కువే&period; అలాగే ప్రతి ఒక్కరూ తాము చూసిన కలల అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు&period; చాలా సార్లు మనకు అస్సలు అర్థం పర్థం లేని కలలు వస్తాయి&period; కానీ కొన్నిసార్లు ఆ కలలు మనల్ని భయపెడతాయి&period; వెంటాడతాయి&period; నిద్రను కూడా పాడు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వ్యక్తికి ప్రతిరోజూ పీడకలలు వస్తుటే అది అతడి దినచర్యను కూడా ప్రభావితం చేస్తుంది&period; మీకూ రోజూ పీడకలలు వచ్చి నిద్రకు భంగం కలుగుతున్నాయా&period; వాటిని ఎదుర్కోవడానికి ఈ కింది జీవిత మంత్రాలను పాటించడం అలవాటు చేసుకోండి&period; కమ్మటి నిద్ర పడుతుంది&period; ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం&comma; మేల్కొవడం అలవాటు చేసుకుంటే చెడు కలలు రావు&period; వారాంతాల్లో కూడా ఇదే అలవాటును కొనసాగించండి&period; పడుకునే ముందు మనసుకు ప్రశాంతత కలిగించే పనులు చేయండి&period; చదవడం&comma; స్నానం చేయడం లేదా విశ్రాంతినిచ్చే సంగీతం వినడం వంటివి ఏదైనా కావచ్చు&period; చెడు కలలు నిద్రకు భంగం కలిగిస్తాయి&period; కాబట్టి దీనిని నివారించడానికి పడకగదిలో సౌకర్యవంతమైన నిద్ర వాతావరణాన్ని సృష్టించడం ముఖ్యం&period; గాఢ నిద్ర రావాలంటే చీకటిగా&comma; నిశ్శబ్దంగా&comma; చల్లగా ఉండే గదిలో పడుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-92030 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;bad-dream&period;jpg" alt&equals;"if you are getting bad dreams follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని ఆహారాలు&comma; పానీయాలు నిద్రకు భంగం కలిగిస్తాయి&period; ముఖ్యంగా నిద్రపోయే ముందు కెఫిన్&comma; ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది&period; ఇది పీడకలలు వచ్చే అవకాశాలను పెంచుతుంది&period; నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్లు&comma; ట్యాబ్లెట్లు&comma; కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం మానుకోండి&period; సోషల్ మీడియాలో వ్యాపించే వార్తలు మీ దృష్టిని మరల్చవచ్చు&period; వాటివల్ల పీడకలలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి&period; ముఖ్యంగా మొబైల్ స్క్రీన్ లైటింగ్ కళ్లకు అస్సలు మంచిది కాదు&period; త్వరగా నిద్రపోనివ్వకుండా చేస్తుంది&period; పీడకలలు పదే పదే బాధిస్తుంటే డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోండి&period; ఎందుకంటే&comma; జీవితంలో మనసుకు తగిలిన గాయాలు&comma; రోజువారీ ఎదుర్కొనే ఒత్తిడి వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిని నిద్రపై ప్రభావం పడేందుకు ఆస్కారం ఉంది&period;<&sol;p>&NewLine;

Admin