ప్రేమ అనే రెండు అక్షరాలు రెండు మనసులను కలుపుతోంది. ప్రేమ అనే వ్యవహారాలు సాధారణంగా స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. అయితే ఏ జంట అయినా స్నేహం నుంచి మరో అడుగు వేసేటప్పుడు అంటే.. నచ్చిన అమ్మాయికి/ అబ్బాయికి తమలో ఉన్న ప్రేమను తెలియజేయడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం. వారికి నచ్చిన విధంగా తమను తాము మార్చుకుంటారు. అయితే స్నేహం నుంచి ప్రేమగా మారేటప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదు. అవేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సమయంలో మాట్లాడే విధానం చాలా ముఖ్యం.
మీరు మీ మనసులోని భావాలను తెలిపే ముందు వారి ఇష్టాఇష్టాలను తెలుసుకోండి. ప్రేమను సరైన మార్గంలో.. సరైన సమయంలో వ్యక్తపరచాలి. వారికి నచ్చిన స్థలానికి తీసుకువెళ్లి మీ మనసులో ఉన్న భావాలను తెలియజేయండి. అప్పుడే ఇతరుల మనసులో ఉన్న భావాలను తేలికగా అర్థం చేసుకోవచ్చు. అయితే మీది కొద్ది రోజుల కిందటి పరిచయమే అయితే.. తనకు ప్రపోజ్ చేయకపోవడమే బెటర్. మీ మధ్య అవగాహన పెరిగేందుకు, తనకు మీ పట్ల ఓ అభిప్రాయం ఏర్పడేందుకు కాస్త టైం ఇవ్వండి. మీకు చాలా నెలలుగా పరిచయం ఉంటే మీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొందరపడి ప్రేమను వ్యక్తపరిచే విషయంలో చాలా సార్లు హడావిడి చేస్తుంటారు. అటువంటి పరిస్థితులలో మీ క్రష్ మీ ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించవచ్చు. అందుకే తొందరపడి ప్రేమను వ్యక్తం చేయకండి.
ముఖ్యంగా ప్రపోజ్ చేసే సమయంలో తన మూడ్ ఎలా ఉందో గమనించండి. తన మూడ్ సరిగా లేకపోతే ఆ సమయాన విరమించుకోవడమే మంచిది. ఇక ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ ప్రేమ విషయాలను సెల్ ఫోన్ ద్వారా తెలియజేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇష్టాఇష్టాలు ఎదురెదురుగా తెలియజేయడానికి అవకాశం ఉండదు. వీలైనంతవరకు ఉత్తరం రాయడానికి ఆసక్తి చూపండి. ఎందుకంటే ఒక కాగితంలో మన మనసులోని భావాలు రాయడం ద్వారా ఎదుటివారు త్వరగా ఆకర్షితులవుతారు. ఇక మరి కొంతమంది తమ ప్రేమ వ్యవహారాలను స్నేహితులనుంచి తెలుసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి ప్రేమ విషయంలో మీ అంతట మీరు పూనుకోవడమే మంచిది. ఇవి పాటిస్తే మీ ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించే అవకాశం ఉండదు.