Rich : అనుకున్నంత మాత్రాన అందరూ ధనవంతులు అయిపోలేరు. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు భవిష్యత్తులో ధనవంతులు అవుతారు. మరి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నీటిని పొదుపుగా ఉపయోగించే స్వభావం ఉండే వ్యక్తులకి, వారి జాతకంలో ఐశ్వర్య ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. సమాజంతో ఎక్కువ కలవని వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరి ధనాధిపతులుగా ఉంటారు. అలానే చిటికెన వేలు, బొటనవేలు సమానంగా ఉంటే కూడా అత్యంత అదృష్టవంతులు. వాళ్లకి సహజంగానే కాలం కలిసి వస్తుంది.
అలానే కనుబొమ్మలు దట్టంగా ఉన్న వాళ్ళు, జీవితంలో అభివృద్ధిలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నవగ్రహాలకి రోజూ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జాతకంలో గ్రహ పీడలు నశిస్తాయి. అదేవిధంగా ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వ్యక్తికి దానగుణం ఉంటే, ఊహించని విధంగా ఇతరుల అంచనాలను తలకిందులు చేసి సమాజంలో గొప్ప ఐశ్వర్యవంతులుగా నిలుస్తారు.
శుచి, శుభ్రత ఉన్న వ్యక్తులు సుఖశాంతులతో ఉంటారు. సోమవారం, శుక్రవారం పుట్టిన వాళ్లు వ్యాపారంలో ఎక్కువగా సంపాదిస్తారు. బుధవారం నాడు పుట్టిన వాళ్ళు భవిష్యత్తులో మహా మేథావులు అవుతారు. భోగభాగ్యాలని అనుభవిస్తారు. ఇతరులని బాధ పెట్టకుండా శాంతి స్వభావం కలిగిన వాళ్ళు, అదృష్టవంతులు. ఇటువంటి వ్యక్తులకి భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుంది.
ఎటువంటి సమస్యలు వాళ్లకి ఉండవు. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆనందంగా ఉంటారు. ఏరోజు ఎలా ఉన్నా ఈ లక్షణాలు ఉన్నవాళ్లు భవిష్యత్తులో కచ్చితంగా ధనవంతులు అవుతారు. లక్ష్మీ కటాక్షం వాళ్ళకి ఉంటుంది. భోగభాగ్యాలని అనుభవిస్తారు. వ్యాపారాల్లో కూడా విజయవంతంగా నిలుస్తారు. అదృష్టం కూడా వీళ్ళకి కలిసొస్తుంది. అలానే ఎప్పుడూ కూడా అంతా భగవంతుడికే వదిలేయకూడదు. మనం కూడా దానికి తగ్గట్టుగా కష్టపడాలి. మనం శ్రమిస్తే, కచ్చితంగా ఏదో ఒక రోజు విజయాన్ని చేరుకుంటాము.