lifestyle

చాణక్య నీతి: పెళ్లికి ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని అసలు వదులుకోవద్దు!!

ఆచార్య చాణక్యుడు తన నైపుణ్యాలు, వ్యూహాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి వల్ల నందవంశం నాశనమైంది. అయితే కేవలం తను రాజకీయాలే కాకుండా, ఆర్థికపరమైన శాస్త్రంలో, తత్వశాస్త్రం ద్వారా ఎన్నో విలువైన విషయాలను వివరించారు. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాలు, సంబంధాల తదితర విషయాల గురించి ప్రస్తావించారు. తన నీతి శాస్త్రంలోని ఎన్నో అద్భుతమైన విషయాలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణగా నిలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏ మనిషి జీవితంలోనైనా ఒకేసారి వచ్చే అందమైన అనుభూతి వివాహం. పెళ్లిపై ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలాంటి పెళ్లి విషయంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని.. సరైన భాగస్వామిని ఎంచుకోవడం తెలిసి ఉండాలని అంటారు చాణక్య. అయితే ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలు కనుక ఎదురైతే అస్సలు వదులుకోకూడదు అంటుంది చాణక్య నీతి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1) సర్దుకుపోవడం.. ఉన్నదాంట్లో తృప్తి చెందడం, సర్దుకుపోవడం ప్రవర్తనలో స్థిరత్వం ఉన్న ఆడవారితో జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని చెబుతుంది చాణక్య నీతి. ఆడపిల్లల్లో, లేదా అబ్బాయిల్లో అత్యాశ భావం ఉంటే అది వారి జీవితం పైనే దుష్ప్రభావం చూపుతుంది. అత్యాశ లేని ఆడపిల్లలు భర్తకే కాదు కుటుంబానికి కూడా మేలు చేస్తారు. 2) కోపాన్ని నియంత్రించుకునే సామర్థ్యం.. క్షణికావేశం జీవితాన్నే నాశనం చేస్తుంది. కోపం కారణంగా పెద్ద పెద్ద సామ్రాజ్యాలే ధ్వంసం అయినట్లు చరిత్ర చెబుతుంది. ఎంత మంచి బంధాన్ని అయినా తలకిందులు చేసేది కోపం ఒక్కటే. అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగే అబ్బాయిలు, అమ్మాయిలు మంచి భాగస్వాములు అవుతారు.

men should marry these type of women

3) ఓదార్పు.. ప్రతి మనిషికి అవసరమైంది ఓదార్పు. తమ జీవితంలోకి వచ్చే భాగస్వామి కష్టమైన, సుఖమైన, దుఃఖమైన ప్రతి సందర్భంలోనూ తమకు అండగా నిలవాలని అనుకుంటారు. మీరు వివాహం చేసుకోబోయే అమ్మాయిలో ఈ లక్షణం ఉన్నట్లయితే వారిని వివాహం చేసుకోవడంలో సంశయించవద్దు. 4) సంతోషం.. ఎప్పుడు వారు సంతోషంగా ఉంటూ.. ఎదుటివారిని సంతోష పెట్టే లక్షణాలు ఉన్న మహిళలు భాగస్వామితో కూడా సంతోషంగా ఉంటారు. ఈ నాలుగు లక్షణాలు అమ్మాయిలో ఉన్నట్లయితే వారిని వివాహం చేసుకోవడానికి సంశయించవద్దు.

Admin

Recent Posts