Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

Meals : భోజనం చేశాక ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయ‌కూడ‌ని ప‌నులు..!

Admin by Admin
November 2, 2024
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Meals : భార‌త‌దేశం ఆయుర్వేద శాస్త్రానికి పుట్టినిల్లు. శాస్త్ర‌సాంకేతికత అభివృద్ది చెంద‌ని స‌మ‌యంలోనే అనేక రోగాలకు చికిత్సలు, ముందు జాగ్రత్తలు సూచించిన విజ్ఞాన సర్వస్వం ఆయుర్వేదం. పెరట్లోని మొక్కలు చేసే మహాద్బుతాలను తెలియజెప్పింది ఆయుర్వేద శాస్త్రం. అలాంటి ఆయుర్వేద శాస్త్రం భోజ‌నం చేశాక కొన్ని ప‌నులు చేయ‌కూడ‌ద‌ని బల్ల గుద్ది చెబుతోంది. అలా చేస్తే ఆరోగ్యం క్షీణించ‌డ‌మే కాదు శ‌రీరానికి ప్ర‌మాదం అని కూడా హెచ్చ‌రిస్తోంది. అవేంటో ఓ సారి చూద్దాం. భోజ‌నం చేసిన త‌రువాత ఎట్టి ప‌రిస్థితిల్లో పండ్లు తిన‌కూడ‌దు. భోజ‌నం చేసిన త‌రువాత వెంట‌నే పండ్లు తిన్న‌ట్ల‌యితే ఆహారం త్వ‌ర‌గా జీర్ణం కాదు. క‌డుపు మొత్తం గాలితో నిండిపోతుంది. దీంతో అజీర్తి క‌లిగే అవ‌కాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ బారిన ప‌డే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. ఒక వేళ త‌ప్పని స‌రిగా పండ్లు తినే అల‌వాటు ఉంటే మాత్రం గంట ముందు లేదా గంట త‌రువాత తీసుకుంటే మంచిది. అన్నం తిన్న త‌రువాత టీ తాగ‌రాదు. భార‌త దేశంలో ఎక్కువ మంది ఈ త‌ప్పును చేస్తున్నారు. అన్నం తిన్న వెంట‌నే టీ తాగడం వ‌ల‌న పెద్ద మొత్తంలో యాసిడ్ విడుద‌ల‌వుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మంద‌గించి ఆల‌స్యంగా ఆహారం జీర్ణం అవుతుంది.

తిన్న త‌రువాత వెంట‌నే న‌డ‌వ‌కూడ‌దు. తిన్న త‌రువాత వెంట‌నే న‌డిస్తే జీర్ణ వ్య‌వ‌స్థ‌లో పెద్ద మొత్తంలో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. దీంతో క‌డుపులో మంట ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అందుక‌ని తిన్న త‌రువాత కాసేపు విశ్రాంతి తీసుకుని 30 నిమిషాల త‌రువాత న‌డ‌క ప్రారంభించాలి. తిన్న వెంట‌నే బెల్టు లూస్ చేసుకోకూడదు. చాలా మంది అతిగా తిన్నామ‌న్న ఉద్దేశ్యంతో బెల్ట్ ను కాస్త లూస్ చేస్తారు. అలా చేయ‌కూడదు.. దీని వ‌ల్ల ఎక్కడైనా ఆగిపోయిన ఆహారం కింది రాదు. సరిగ్గా జీర్ణం కాదు. ఎట్టి ప‌రిస్థితిలో తిన్నాక‌ స్నానం చేయకూడదు. ఉద‌యం అయినా సాయంత్రం అయినా భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే రక్తం అంతా కాళ్లకు, చేతులకు మొత్తం ఒంటికి పాకి పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్ధ సామర్థ్యం తగ్గిపోతుంది.

mistakes we do after meals

అన్నం తిన్న వెంట‌నే నిద్ర పోకూడదు. భోజనం చేసిన వెెంటనే నిద్ర‌లోకి జారుకుంటే ఇబ్బందే. ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు, ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మామూలుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక 10 నిమిషాలు పడుకొని లేవటం మంచిది. అలాగే నిద్ర‌ను కొన‌సాగిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది త‌ప్ప‌దు. భోజ‌నం చేశాక ఈత కొట్ట‌కూడ‌దు. తిన్న వెంట‌నే స్విమ్ చేయ‌డం ప్రమాదం అని చెబుతోంది ఆయుర్వేదం. ర‌క్త ప్ర‌స‌ర‌ణ వేగం పెరిగి శ‌రీర కండ‌రాలు స్త‌బ్ధుగా మారుతాయ‌ని చెబుతోంది. జిమ్, వ్యాయ‌మం.. ఆట‌లు కూడా ఆడ‌కూడ‌దు.

భోజ‌నం చేశాక ధూమ‌పానం చేయ‌కూడ‌దు. ధూమ‌పానం ఎప్పుడు చేసిన ప్ర‌మాద‌మే కానీ తిన్న త‌రువాత ధూమ‌పానం అసలు చేయ‌కూడ‌దు. అలా చేయ‌డం వ‌ల్ల ఒకే సారి 10 సిగ‌రెట్లు తాగిన ఎఫెక్ట్ ను కాలేయానికి అందిస్తుందంట‌. దీంతో ఊపిరితిత్తుల‌పై భారం ఎక్కువ‌వుతుంద‌ని చెబుతోంది ఆయుర్వేదం. క‌నుక భోజ‌నం చేసిన వెంట‌నే ఈ త‌ప్పుల‌ను అస‌లు చేయ‌రాదు. లేదంటే ఇబ్బందులు ప‌డ‌తామ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

Tags: meals
Previous Post

Lakshmi Devi : అప్పుల బాధల నుంచి విముక్తులు అవ్వాలంటే.. ఇలా చేయాలి.. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది..!

Next Post

ఈ ప‌ద్ద‌తుల‌లో మీ కాలేయాన్ని శుభ్ర‌ప‌ర‌చుకోండి..!

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.