హైదరాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా ప్రయాణం చేసే వారికి శుభవార్త. ఎయిర్ పోర్టులో కొత్త తరహా పాడ్స్ అందుబాటులోకి వచ్చాయి. జేపాడ్ అనే కంపెనీ ఈ పాడ్స్‌ను ఎయిర్‌పోర్టులో కొత్తగా లాంచ్ చేసింది. ఈ పాడ్స్ వల్ల ప్రయాణికులకు ఎంతో హోటల్ ఖర్చు ఆదా కానుంది. సాధారణంగా హోటల్‌లో వెయిట్ చేయాలంటే ఒక రాత్రికి ట్రాన్సిట్ ప్యాసింజర్‌లకు రూ.10వేలు అవుతున్నాయి. కానీ ఈ పాడ్ వల్ల ఆ వ్యయం భారీగా తగ్గనుంది.
గంటకు రూ.500 చెల్లిస్తే చాలు ఈ పాడ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో ప్రయాణికులకు కావల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి. అయితే ఇంకా ఎక్కువ సేపు ఉంటే చార్జి తక్కువ అవుతుంది. అంటే ఉదాహరణకు ఒక ప్రయాణికుడు జేపాడ్‌లో 3 గంటలు ఉంటే రూ.1500 కాదు రూ.1400 చెల్లించాలని నిర్వాహకులు చెబుతున్నారు. సమయం ఎక్కువ అయ్యే కొద్దీ చార్జి తక్కువగా ఉంటుందని వారంటున్నారు.
సాధారణంగా ట్రాన్సిట్ ప్యాసింజర్లు ఎయిర్ పోర్టులలో తమ నెక్ట్స్ ఫ్లైట్ కోసం వెయిట్ చేయాలంటే హోటల్‌లో రూమ్ తీసుకోవాలి. రోజుకు రూ.10వేలకు తక్కువ కాదు. అందువల్ల జేపాడ్‌ను ప్రవేశపెట్టామని ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీని వల్ల విమాన ప్రయాణికులకు భారీగా హోటల్ చార్జిలు తగ్గుతాయని వారంటున్నారు. మరి జేపాడ్ ఐడియా ఎలా ఉంది.. మీ కామెంట్ తెలియజేయండి.