Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మీ పిల్ల‌ల‌పై మీరు ఎక్కువ కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

Admin by Admin
May 21, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మీరు అలా ఉండకూడదు.. ఇలా ఉండకూడదు.. ఇది మాత్రమే చెయ్యాలి.. అది చెయ్యకూడదు అంటూ మీ పిల్లలకు కండీషన్స్‌ పెడుతున్నారా? వారితో కఠినంగానే ఉంటేనే మనపై గౌరవ, మర్యాదలతో ఉంటారనీ, చెప్పిన మాటల వింటారని అనుకుంటున్నారా? అయితే క్రమంగా మీరే మీకు మీ పిల్లలకు మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించుకుంటున్నారన్నమాట. నమ్మకం కలగటం లేదా.. అయితే ఈ Parenting tips పూర్తిగా చదవండి. పిల్లల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మీరు ప్రవర్తించే తీరు, వారితో గడిపే సమయం, మాట్లాడే ప్రతిమాట వారిని ప్రభావితం చేస్తాయి. మీ ప్రవర్తన ఆధారంగానే.. వారు కూడా ప్రవర్తిస్తారని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నాం, క్రమశిక్షణతో పెంచేస్తున్నాం అంటూ కఠిన నియమాలు పెడితే మెుదటికే మోసం వస్తుంది. మీతో వారు ఎప్పటికీ క్లోజ్‌గా మూవ్‌ కాలేరు అటువంటి చర్యల వల్ల.

క్రమశిక్షణ పేరిట వారిని శిక్షిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. మీకు భయపడి ఇంట్లో నెమ్మ‌దిగా ఉన్నా.. బయటకు వెళ్లినప్పుడో, మీరు వారితో లేనప్పుడో, పాఠశాలలల్లోనూ దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా తప్పు చేస్తే.. పనిష్మెంట్‌ ఇవ్వటం పిల్లలలో ప్రతికూల భావాలు ఏర్పడతాయి. ఆ పనిని ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రేమగా అడిగి తెలుసుకోండి.. మరలా అటువంటి పనులు చేయవద్దని సున్నితంగా మందలించండి.. అంతేగానీ కఠినంగా వ్యవహరించకండి. అలా మాట్లాడకూడదు.. ఇలా ఆడకూడదు అంటూ రూల్స్‌ పెట్టకండి. ఇంట్లో మీరు సున్నితంగా మాట్లాడితే.. క్రమంగా మిమ్మల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారని గుర్తుపెట్టుకోండి. పిల్లలు వారి తల్లిదండ్రులను అనుకరించేందుకు ప్రయత్నిస్తారని తెలుసుకోండి. బయటకు వెళ్లినప్పుడు స్వేచ్ఛగా తిరగనివ్వండి. ఎగరకూడదు, గెంతకూడదు అని నిబంధనలు పెట్టకండి.

parents must follow these parenting tips for their kids

పిల్లలు ఏమైనా చెప్పినప్పుడు ఏకాగ్రతతో వినండి. అంతేగాని నామమాత్రంగా ఊకొట్టి వదిలేయకండి. దీనివల్ల తాము ఏం చెప్పినా తల్లిదండ్రులు వినరు అన్న భావనకు వచ్చేస్తారు. అనుకోకుండా వారు ఏమైనా తప్పు చేసినప్పుడు సంజాయిషీ చెప్పినప్పుడు వారివైపు నుంచి కూడా ఆలోచించండి.. అనాలోచితంగా పిల్లలదే తప్పు అని రుద్దకండి. దీనివల్ల మీపై పిల్లలు నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి గురయ్యి.. మానసిక రుగ్మతలతో బాధపడే ఆస్కారం ఉంది. పిల్లలతో ఫ్రెండ్స్‌లా పేరంట్స్‌ ఉంటే.. వారు మీతో వారుకున్న అన్ని సమస్యలను మనసు విప్పి చెప్పుకోగలరు. వారి ఇష్టాయిష్టాలు పంచుకోగలుగుతారు. వారితో ఎక్కువ సమయం గడపటానికి ట్రై చేయండి. మీ ఆఫీస్‌ సమస్యలు ఇంటి వరకు తీసుకురాకండి. పిల్లల వద్ద ఆర్థిక సమస్యల గురించి మాట్లాడకండి. తరుచుగా పిల్లలను బయట తిప్పండి. భార్యభర్తల మధ్య వివాదాలు సహజమే.. కానీ పిల్లల ముందు మీ కోపతాపాలు చూపించకండి. అమ్మ కూచి, నాన్న కూచి అన్న స్టాంప్‌ను పిల్లలు మీద వేయకండి.

Tags: kidsparents
Previous Post

ల‌వ్‌లో ఫెయిల్ అయ్యారా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..

Next Post

ఛార్లీ చాప్లిన్ చెప్పిన జీవిత సత్యం.. అది కూడా ఒక జోక్ తో…!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!