పెన్నులు, పెన్సిళ్లు, స్కెచ్ పెన్నులు… ఇలా చెప్పుకుంటూ పోతే ఆ విభాగంలో చాలా రకాలే మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఎవరి అవసరానికి, ఇష్టానికి తగినట్టుగా వారు వాటిని వాడుతారు. ఈ క్రమంలో పెన్ను లేదా పెన్సిల్ దేన్నయినా ఒక్కొక్కరు ఒక్కో విధంగా పట్టుకుని రాస్తారు. కొందరు చేతి బొటన వేలు, చూపుడు వేలితో పట్టుకుని రాస్తే, కొందరు మధ్య వేలును కూడా వాడుతారు. సౌకర్యవంతంగా ఉండేందుకు గాను ప్రతి ఒక్కరు అలా వివిధ రకాలుగా పెన్నులు, పెన్సిళ్లతో రాస్తారు. అయితే అలా వారు రాసే విధానాలను అనుసరించి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పవచ్చట. అదెలాగంటే… పెన్నుపై చూపుడు వేలు, మధ్య వేలును ఉంచి వాటిపై బొటన వేలిని పెట్టి రాస్తే అప్పుడు వారు కళాత్మక దృష్టి కలిగి ఉంటారట. అలాంటి వారు ఊహా ప్రపంచంలో ఎక్కువగా విహరిస్తారట. జీవితంలో గొప్ప సంఘటనలు జరగాలని ఆశిస్తారట. వారు తమ చుట్టూ ఉన్నవారు సంతోషంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటారట. వీరు బాగా ఆలోచిస్తారట.
చూపుడు వేలు, మధ్యవేలుకు మధ్యలో పెన్ను లేదా పెన్సిల్ పట్టుకుని రాస్తే వారు సామాజిక వేత్తలుగా ఉంటారట. సమాజ సమస్యల పట్ల స్పందిస్తారట. వీరు ఎక్కువగా క్షమించే గుణం కలిగిన వారై ఉంటారట. ఏ విషయాన్నయినా గోప్యంగా ఉంచుతూ నాటకం ఆడేవారు అంటే వీరికి ఇష్టం ఉండదట. బొటన వేలు, చూపుడు వేలి మధ్య పెన్నును పట్టుకుని రాస్తే వారు ఎక్కువగా నిజాయితీ పరులై ఉంటారట. ప్రతి విషయం పట్ల జాగ్రత్తగా ఉంటారట. వీరు ప్రేమ విషయంలో సిగ్గుగా ప్రవర్తిస్తారట. పిడికిలి మూసే విధానాన్ని బట్టి కూడా వ్యక్తుల స్వభావాలు ఎలా ఉంటాయో చెప్పవచ్చు. అదెలాగంటే… బొటన వేలిని దాస్తూ పిడికిలిని మూస్తే వారు తమ మనస్సులో ఉన్న భావాలను ఎదుటి వారికి క్లియర్‌గా చెబుతారట. అంతేకానీ ఏ విషయాన్ని దాచుకోరట. వీరికి హాస్యం పాళ్లు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయట. అందరినీ నవ్విస్తూ ఉంటారట. ఎదుటి వారి సంతోషం కోసం వీరు తమ సంతోషాన్ని చంపుకుంటారట.
బొటనవేలిని పైకి తెస్తూ పిడికిలిని మూస్తే వారు ఎక్కువగా ప్రతిభావంతులు అయి ఉంటారట. వీరికి నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందట. వీరు ఎక్కువగా సెన్సిటివ్ తరహా మనస్తత్వం కలిగి ఉంటారట. ఇతరుల నుంచి వీరు ఎక్కువగా ఆశిస్తారట. బొటనవేలిని మిగిలిన వేళ్లకు పక్కగా తెస్తూ అప్పుడు పిడికిలిని మూస్తే వారు సెన్సిటివ్ మనస్తత్వం కలిగి ఉంటారట. ఊహాశక్తి ఎక్కువగా కలిగి ఉంటారట. వీరికి అభద్రతా భావం ఎక్కువట. వీరు ఇతరుల పట్ల సిన్సియర్‌గా ఉంటారట.