Mudra For Wealth : యోగ ముద్రలు మన శరీరాన్ని, మన మెదడుని, మన మనసుని శక్తివంతంగా మార్చడానికి ఉపయోగపడతాయి. మొత్తం ఐదు వేళ్ళు. మొత్తం మన అయిదు వేళ్ళు పంచభూతాలని సూచిస్తాయి. చేతి వేళ్ళ కదలిక వలన మన బాడీ మీద ఆ ప్రభావం పడుతుంది. ఇలా యోగ ముద్రలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. చాలామందికి యోగ ముద్రల గురించి తెలియదు. చక్రాలని యాక్టివేట్ చేయడానికి యోగ ముద్రలు బాగా ఉపయోగపడతాయి.
మనలో కొత్త శక్తిని తీసుకురావడానికి ఈ ముద్రలు బాగా ఉపయోగపడతాయి. మెదడు చురుకుదనాన్ని యోగ ముద్రలు పెంచుతాయి. ఈరోజు ఒక శక్తివంతమైన ముద్ర గురించి తెలుసుకుందాం. చాలామంది సెలబ్రిటీలు కూడా యోగా ముద్రలు లో కూర్చుంటూ ఉంటారు. అది కూడా ఎక్కువగా హాతి ముద్ర. మెదడుని శక్తివంతంగా మార్చడానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది.
అద్భుతమైన కల్పనా శక్తిని, జ్ఞాపక శక్తిని ఈ ముద్ర తో పొందవచ్చు. అలానే సరైన నిర్ణయాలను తీసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ ముద్ర తో మన యొక్క ఆలోచన శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు. ఆలోచన శక్తి ఒక సారి పెరిగింది అంటే కచ్చితంగా మనం ఎన్నో పనులని సులభంగా పూర్తి చేయగలము. ఎన్నో విజయాలని అందుకోగలము. పైగా ఏదో తెలియని ప్రశాంతత ని కూడా ఇలా ముద్రలతో పొందవచ్చు. ధ్యానం చేసినా చేయకపోయినా ఈ ముద్రని వేయడం వలన చక్కటి ప్రయోజనాలని పొందవచ్చు.
ఈ ముద్ర లో ఉన్నప్పుడు ఎనర్జీ ఫ్లో ని కూడా మీరు గమనించొచ్చు. ఒంట్లో ఏదో శక్తి ప్రవహిస్తున్నట్లు కూడా మీకు తెలిసిపోతుంది. ఖాళీ సమయంలో ఒకసారి వెన్నెముకుని నిటారుగా ఉంచి కూర్చుని ఈ ముద్రని వేయండి. కచ్చితంగా మీ చేతి వేళ్ల ద్వారా మీకు మనశ్శాంతి కలుగుతుంది. చక్కగా మెదడు పని చేయడం మొదలు పెడుతుంది. మీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు బాగా పెంపొందించుకోవచ్చు.