హిందూ మతంలో సూర్య గ్రహణానికి ఎంతో విశిష్టత ఉంది. సూర్య గ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు. ఈ కారణంగా భూమిపై సూర్యుని కాంతి తగ్గుతుంది. ఈ గ్రహణం సమయంలో ఆలయాల తలుపులు కూడా మూసేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీ మొదటి సూర్య గ్రహణం ఏర్పడింది. దీని ప్రభావం అమెరికా, ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ మాసంలో వచ్చే రెండో చంద్ర గ్రహణం గురించి చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది ఏ తేదీన వస్తుంది. మన దేశంలో కనిపిస్తుందా లేదా? సూతక్ కాలం మనకు వర్తిస్తుందా లేదా ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీ, 2024న సంభవించనుంది. అయితే తొలి సూర్య గ్రహణంలా ఈ సూర్య గ్రహణం కూడా భారత్‌లో కనిపించదు.
ఈ సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీ రాత్రి 09.13 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 03.17 గంటల వరకు ఉంటుంది. అయితే ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు. అంటే ఈ గ్రహణ వ్యవధి దాదాపు 6 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది. సూర్య గ్రహణం పూర్తయిన వెంటనే పవిత్ర నదీ స్నానం చేయాలి లేదా గంగాజలంతో కలిపి స్నానం చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. గంగాజలం అందుబాటులో లేని వారు స్నానం చేసే నీటిలో కాస్త గరిక లేదా తులసి ఆకులను వేసి స్నానం చేయాలి. ఆ తర్వాత ఉతికిన బట్టలను ధరించాలి. అనంతరం ఇంటిని శుభ్రం చేసి గంగాజలం చల్లాలి.గ్రహణం తర్వాత ఆహారం లేదా బట్టలు వంటివి దానం చేయడం మంచిది. ఇంట్లో ప్రార్ధనలు చేయడం, మంత్రాలు పఠించడం వంటివి చేస్తే ప్రతికూలత దూరం అవుతుంది. గ్రహణం ముగిసాక మీ ఇంటి తలుపులు తెరిసి ఉంచితే నెగెటివ్ ఎనర్జీ బయటకు పోతుంది.
సూర్యగ్రహణం సమయంలో తినడం, త్రాగడం నిషేధించబడింది. గ్రహణం సమయంలో వెలువడే హానికరమైన కిరణాలు ఆహారాన్ని కలుషితం చేస్తాయని నమ్ముతారు. నిద్రపోవడం కూడా మంచిది కాదు. గ్రహణం సమయంలో ప్రయాణం కూడా చేయకూడదు. గ్రహణ సమయంలో ప్రయాణించడం వల్ల ప్రమాదాల ప్రమాదం పెరుగుతుందని నమ్ముతారు.కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు. గ్రహణం సమయంలో లోహ పాత్రలు వాడితే విషపూరిత మూలకాలు కలిసిపోతాయని నమ్ముతారు. గ్రహణ సమయంలో గర్భిణులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గ్రహణాన్ని వీక్షించకుండా ఇంట్లోనే ఉండాలి. గ్రహణం సమయంలో ఉపవాసం ఉండి, గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోండి. ఇది మానసిక, శారీరక శుద్దీకరణను అందిస్తుంది.సూర్య గ్రహణానికి ముందు అన్ని ఆహార పదార్ధాలు, వండిన ఆహారంలో తులసి దళాలను జోడించండి. ఇలా చేయడం వల్ల గ్రహణం సమయంలో కూడా ఆహారం స్వచ్ఛంగా ఉంటుందని నమ్ముతారు.