నేటి రోజుల్లో ప్రతి ఒక్కరిలోనూ అతివిలువైన ప్రేమావేశం కరువవుతోంది. ప్రేమ లేని పెళ్ళిళ్ళు, బోర్ కొట్టే బంధాలు, సారంలేని రతిక్రీడలు. జంటలు ఏదో ఒక రకంగా సంవత్సరాలు గడిపేస్తున్నారు. కారణం…అభధ్రత చోటు చేసుకోవడం. ఒకరంటే ఒకరికి నమ్మకాలు లేక విడిపోతామేమో నన్న భయాలతో జీవించేస్తుంటారు. సర్దుకుపోతుంటారు. విడిపోవటమనే మాట వారిని ఎంతో కలవరపెడుతుంది. గత అనుభవాల భయాలతో ప్రస్తుత జీవితాలను గడిపేస్తున్నారు.
మరి ప్రేమలో త్వరగా పడటం, సంబంధాలను ప్రేమ పూర్వకంగా కొనసాగించుకోటానికి కొన్ని చిట్కాలు చూడండి. సంతోషం, ఆనందం, ఓర్పు, ఆశాభావం వంటివి బ్రెయిన్ లో తయారయ్యే డోపమైన్ అనబడే ఒక రసాయనం కలిగిస్తుంది. అది మీ ఎనర్జీని ప్రభావితం చేసి కొత్త అంశాలు చేయటానికి కొత్త ఆహారం తీసుకోటానికి తోడ్పడుతుంది.
లవ్ లో పడితే వెయిట్ తగ్గుతారు. ఎడ్రినలిన్ ఉత్పత్తి అయి మీ ఆకలిని చంపేస్తుంది. బాగా కనపడాలంటూ చాలామంది జిమ్ లకు వెళ్ళిపోవడం చూస్తూనే వుంటాం. లవ్ లో పడితే కొత్త మెదడు కణాలు పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. లవ్ లో పడ్డవారు చిన్నవారుగా కనపడతారు. కారణం ఆక్సీటోసిన హార్మోన్ మీలో అధికంగా తయారై శరీర కణాల మెరుగుదలకు తోడ్పడుతుంది.
అద్భుత ప్రేమావేశాలతో జీవితం సాగించేవారు సింగల్ గా జీవించేవారికంటే అధిక కాలం జీవిస్తారు. కారణం. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పార్టనర్ నుండి రొమాంటిక్ సహకారం తీసుకుంటుంది. గుండె జబ్బులు దరికి చేరవు. మరి ఇక ఆలస్యం ఎందుకు, లవ్ లో పడండి తనివితీరా జీవితాన్ని ఆనందించండి.