lifestyle

వివాహ జీవితంలో భార్య భర్తల మధ్య దూరానికి ఇవే కారణం..!

ప్రస్తుత సమాజంలో చాలామంది జంటలు పెళ్లి చేసుకొని మూన్నాళ్ళయినా కాకముందే విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకొని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు.. భార్యాభర్తలధ్య ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకుంటే వారి వివాహ జీవితంలో చీలిక ఏర్పడే అవకాశం ఉంటుందని చాణిక్యుడు అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల జీవిత భాగస్వామిపై నమ్మకం పోతుందని, అనుమానం పెరిగి అది మీ సంబంధం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంద‌ని అంటున్నారు.

కోపంతో ఉన్న వ్యక్తిని మరింత కోపం పెరిగేలా చేయడం కూడా భార్య భర్తల మధ్య సంబంధాన్ని చెడగొడుతుంది. దీని వల్ల ఇతరులకు హాని కలిగే నిర్ణయాలు కూడా తీసుకుంటారు. భార్య భర్తలు అన్నాక కొన్ని విషయాలలో పరిధి ఉంటుంది. ఈ క్రమంలో ఎవరి రహస్యాలు వారి దగ్గరే ఉండాలి. ఇలాంటి రహస్య విషయాలను మరొకరితో పంచుకుంటే అవి మీ జీవిత భాగస్వామిని బాధపెడతాయి. అప్పుడు మీ సంబంధం బలహీనపడి తగాదాలకు దారి తీస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి తప్ప కించపరచుకోకూడదు. ఇలా చేయడం వల్ల చిన్న విషయాలు పెద్దగా అయిపోయి గొడవ ఏర్పడి ఈ బంధంపై ప్రభావం పడుతుంది.

these are the main reasons for wife and husband divorce

ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడూ ప్రేమానురాగాలతో జీవించాలి. ఈ దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రవేశిస్తే మాత్రం మీ బంధం ఎక్కువ కాలం కొనసాగదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలియజేశాడు.

Admin

Recent Posts