lifestyle

ఈ 10 మొక్కలు మన చుట్టూనే పెరుగుతాయి..! కానీ వాటితో ఎంత ప్రమాదం ఉందో మీకు తెలుసా..?

మొక్క‌లంటే మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డేవి ప్ర‌కృతిలో చాలా ర‌కాలే ఉంటాయి. వాటి వ‌ల్ల మ‌న‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన ఔష‌ధాలు ల‌భిస్తాయి. దీంతో మ‌న‌కు క‌లిగే అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అయితే ప్ర‌కృతిలో మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మొక్క‌లు మాత్ర‌మే కాదు, కొన్ని ఉప‌యోగ‌ప‌డ‌నివి కూడా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని మొక్క‌లైతే మ‌న‌కు హాని క‌లిగిస్తాయి. విషం మ‌న శ‌రీరంలో చేరేలా చేస్తాయి. వాటి ఆకుల‌ను, పువ్వుల‌ను, కొమ్మ‌ల‌ను ముట్టుకున్నా మ‌న శ‌రీరంలోకి విష ప‌దార్థాల‌ను పంపుతాయి. దీంతో మ‌న‌కు అస్వ‌స్థ‌త క‌లుగుతుంది. కొన్ని సంద‌ర్భాల్లోనైతే ప్రాణాలు కూడా పోవ‌చ్చు. మ‌రి మ‌న ప్రాణాల‌కు ప్ర‌మాదం క‌లిగించే ఆ మొక్క‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

these plants grow around us and are very dangerous

Cowbane or Water Hemlock.. దీని సైంటిఫిక్ పేరు Cicuta virosa. ఇది ఐరోపా, ఉత్త‌ర అమెరికా, ఆసియాల్లోని ప్రాంతాల్లో పెరుగుతుంది. న‌దీ పరివాహ‌క ప్రాంతంలో ఒడ్డుకు ఈ మొక్క‌లు పెరుగుతాయి. ఇవి క్యారెట్ లాంటి వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని ఎలా ముట్టుకున్నా చాలా ప్ర‌మాదం. మూర్ఛ రావ‌చ్చు. వాంతులు, వికారం క‌లుగుతాయి. గుండె ప‌నితీరుకు ఆటంకం క‌లుగుతుంది. ఈ మొక్క‌ వేళ్లు చాలా విషంతో కూడుకుని ఉంటాయి. Elder.. ఈ మొక్క సైంటిఫిక్ పేరు Sambucus. ఆస్ట్రేలియాలో ఈ మొక్క పెరుగుతుంది. ఇందులో ఎరుపు, న‌లుపు రంగులో ఉండే కాయ‌ల‌ను కాసే రెండు ర‌కాలు ఉన్నాయి. ఎరుపు రంగు కాయ‌లు కాసే మొక్క ప్ర‌మాదకరం. దీని ఆకులు ముట్టుకుంటే వెంట‌నే చేతుల‌ను క‌డుక్కోవాలి. లేదంటే విషం లోప‌లికి వెళ్లి క‌డుపునొప్పి, త‌ల‌నొప్పి, గుండె స‌మ‌స్య‌లు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది క‌లుగుతాయి.

Oleander.. దీని సైంటిఫిక్ పేరు Nerium. అనేక ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. ఈ మొక్క ఆకులు, పువ్వులు విష‌పూరితం. ముట్టుకుంటే వాంతులు, వికారం వ‌స్తాయి. గుండె స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు. ఫ‌లితంగా మ‌ర‌ణం సంభ‌వించ‌వ‌చ్చు. Aconite or Wolf’s Bane.. దీని సైంటిఫిక్ పేరు Aconitum. ఈ మొక్క కూడా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెరుగుతుంది. ఈ మొక్క ఆకులు చాలా విష‌పూరిత‌మైన‌వి. అవి నేరుగా శ‌రీరంలోని నాడీ మండ‌లంపై ప్ర‌భావం చూపుతాయి. దీంతో దృష్టి పోతుంది. మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌వ‌చ్చు. Jimsonweed.. Datura stramonium దీని సైంటిఫిక్ పేరు. ఈ మొక్క కూడా అనేక ప్రాంతాల్లో పెరుగుతుంది. దీని ఆకులు, పండ్లు, విత్త‌నాలు ప్ర‌మాద‌క‌రం. వీటిని సేవిస్తే కోమాలోకి వెళ్తారు. Hogweed.. దీని సైంటిఫిక్ పేరు Heracleum. ఆసియా, యూర‌ప్‌, అమెరికా ప్రాంతాల్లో ఈ మొక్క పెరుగుతుంది. దీని ఆకులు, పువ్వులు, కాయ‌లు ప్ర‌మాద‌క‌రం. తీసుకుంటే ప్రాణాంత‌క చ‌ర్మ వ్యాధులు వ‌స్తాయి.

Spurge.. దీని సైంటిఫిక్ పేరు Euphorbia. ఇది ప్ర‌తి చోటా పెరుగుతుంది. ఈ మొక్క ఆకులు, పువ్వులు, ముళ్లు ప్ర‌మాద‌క‌రం. తాకితే జ్వ‌రం, ఇన్‌ఫెక్ష‌న్‌, చ‌ర్మ వ్యాధులు, శ‌రీరం వాపు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. Rhubarb.. దీని సైంటిఫిక్ పేరు Rheum rhabarbarum. అది అమెరికా, ర‌ష్యా, యూర‌ప్‌ల‌లో పెరుగుతుంది. దీని ఆకులు, వేళ్లు ప్ర‌మాద‌క‌రం. తీసుకుంటే వికారం, వాంతులు, విరేచ‌నాలు, కిడ్నీ స్టోన్లు, క‌ళ్లు, గొంతులో మంట వంటి స‌మ‌స్య‌లు వస్తాయి. Belladonna.. దీని సైంటిఫిక్ పేరు Atropa belladonna. ఇది కూడా చాలా చోట్ల పెరుగుతుంది. దీని ఆకులు, పువ్వులు, కాయ‌లు ప్ర‌మాద‌క‌రం. తాకితే గుండె కొట్టుకోవ‌డంలో ఇబ్బందులు వ‌స్తాయి. అన్ని చోట్లా మంట పుట్టిన‌ట్టు అనిపిస్తుంది. నోరు పొడిగా మారుతుంది. ఒక్కోసారి మ‌ర‌ణం సంభ‌వించ‌వ‌చ్చు.

Castor Bean.. దీని సైంటిఫిక్ పేరు Ricinus communis. ఇది ఆముదం మొక్క‌. దీని విత్త‌నాల నుంచి తీసే నూనె మ‌న‌కు ప‌నికొస్తుంది. కానీ ఈ మొక్క విత్త‌నాల‌ను మాత్రం తిన‌రాదు. తింటే ప్ర‌మాద‌క‌రం. శ‌రీరం విష‌తుల్యంగా మారుతుంది. మ‌ర‌ణం సంభ‌వించేందుకు అవ‌కాశం ఉంటుంది.

Admin