lifestyle

నిమ్మకాయల నిల్వకు ఇదే బెస్ట్ ట్రిక్.. నెలలు గడిచినా చెడిపోవు..

<p style&equals;"text-align&colon; justify&semi;">పిడికెడంత కూడా ఉండని నిమ్మకాయ పుల్లని రుచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; వంటలు&comma; రిఫ్రెషింగ్ డ్రింక్స్&comma; గార్నిషింగ్&comma; స్కిన్ కేర్ ఇలా తరచూ ఏదొక విధంగా రోజూ ఉపయోగిస్తూనే ఉంటారు&period; ముఖ్యంగా వేసవిలో ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్ సమస్యను నివారించేందుకు నిమ్మరసం తరచూ తాగుతుంటారు&period; ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే శక్తి కూడా నిమ్మరసానికి ఉంటుంది&period; కాబట్టి&comma; ప్రతి ఇంట్లో నిమ్మకాయలు స్టోర్ చేసుకునే అలవాటు ఉంటుంది&period; అయితే&comma; నిమ్మకాయలు చాన్నాళ్లు నిల్వ ఉండవు&period; వేగంగా నల్లగా మారిపోయి రసం తగ్గిపోతుంది&period; ఈ సులభమైన ట్రిక్స్ పాటిస్తే మాత్రం నిమ్మకాయలు నెలల తరబడి చెడిపోకుండా తాజాగా ఉంటాయి&period; మీరు నిల్వ చేయడానికి నిమ్మకాయలు కొంటున్నట్లయితే శుభ్రంగా&comma; మచ్చలు లేని నిమ్మకాయలను కొనండి&period; ఒకవేళ నిమ్మకాయపై ఏదైనా మరక లేదా మచ్చ కనిపిస్తే వెంటనే దాన్ని తొలగించండి&period; ఎందుకంటే వీటివల్లే నిమ్మకాయలు త్వరగా చెడిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎల్లప్పుడూ నిల్వ కోసం తాజా నిమ్మకాయలనే కొనండి&period; అప్పుడే అవి నెలల తరబడి ఉంటాయి&period; తాకడానికి మృదువుగా ఉంటూ పల్చని తొక్కలు కలిగిన జ్యుసీ నిమ్మకాయలనే నిల్వ కోసం కొనండి&period; మందంగా ఉన్న తొక్కలు కలిగిన నిమ్మకాయలతో పోలిస్తే వీటిలో రసం ఎక్కువగా ఉంటుంది&period; కాబట్టి&comma; త్వరగా ఆవిరైపోవు&period; ఒక పెద్ద పాత్రలో నీళ్ళు తీసుకుని అందులో ఒక చెంచా లేదా రెండు చెంచాల వెనిగర్ కలపండి&period; ఇప్పుడు అన్ని నిమ్మకాయలను ఈ వెనిగర్ లో పది నిమిషాలు నానబెట్టండి&period; తర్వాత వీటిని శుభ్రమైన పొడి గుడ్డతో తుడిచి ఒక పాత్రలో ఉంచండి&period; ఇప్పుడు ఈ నిమ్మకాయలన్నింటినీ కనీసం 15 నిమిషాలు ఎండలో ఉంచండి&period; అప్పుడు నీళ్లన్నీ పూర్తిగా ఆరిపోతాయి&period; తర్వాత చేతిలో రెండు నుంచి మూడు చుక్కల వంట నూనె తీసుకొని అన్ని నిమ్మకాయలపై రాయండి&period; అప్పుడు పై భాగం శుభ్రమై నిమ్మకాయపై ఒక సన్నని పొర ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84793 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;lemon&period;jpg" alt&equals;"this is how you can store lemon for months " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనివల్ల బయట నుంచి బ్యాక్టీరియా ప్రవేశించలేదు&period; అయితే&comma; నిమ్మకాయలకు ఎక్కువ నూనె అంటకుండా జాగ్రత్త వహించండి&period; గాలి చొరబడని గాజు పాత్రలో నిమ్మకాయలను వేసి మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి&period; మీరు నిమ్మకాయలను ఒకటి నుంచి రెండు నెలలు మాత్రమే ఉంచాలనుకుంటే వాటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి&period; 4-5 నెలలు ఉంచాలనుకుంటే ఫ్రీజర్‌లో ఉంచండి&period; నిమ్మకాయలను ఫ్రిజ్ లేదా ఫ్రీజర్‌లో ఉంచండి&period; నిమ్మకాయను ఉపయోగించే ముందు వేడి నీటిలో వేసి పది నిమిషాలు ముంచండి&period; నీరు మరిగేలా జాగ్రత్త వహించండి&period; అది మెత్తగా మారినప్పుడు దానిని నీటి నుంచి తీసి పిండితే రసం వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts