lifestyle

అందంగా ఫోటో దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.. అడ్డంగా బుక్కయ్యారు.. మీకు తేడా కొట్టడం లేదా..?

బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ జంట తమ బాల్కనీలోని పూల కుండీలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. రెండు కుండీల్లో గంజాయి మొక్కలు కూడా వేశారు. అయితే, ఇటీవల ఉర్మిత తన బాల్కనీలో పెంచుతున్న వివిధ మొక్కలతో ఫోటో దిగి దాన్ని తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటో నెట్టింట వైరల్ అవ్వడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.

ఉర్మిళ బంధువు ఒకరు పోలీసులు వచ్చేలోపు కుండీలోని గంజాయి మొక్కల్ని తీసిపారేశారు. ఐతే, పోలీసులు కుండీల్లో గంజాయి ఆకుల్ని గుర్తించారు. 54 గ్రాములు ఉన్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాభసాటిగా విక్రయించాలనే ఆలోచనతోనే గంజాయిని పెంచుతున్నట్లు దంపతులు అంగీకరించారు. దంపతులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

urmitha and husband booked for ganja plants growing

అందుక‌నే పోలీసులు చెప్తుంటారు, నేర‌స్తులు దొరికిపోతారంటే అది పోలీసుల ప‌నిత‌నం కాద‌ని, చిన్న త‌ప్పు చేసి కూడా ఈజీగా దొరికిపోతుంటార‌ని, అది ఈ దంప‌తుల‌ను చూస్తే నిజ‌మే అనిపిస్తుంది. ఇంట్లో గంజాయి పెంచి వ్యాపారం చేద్దామ‌నుకున్నారు. కానీ అడ్డంగా బుక్క‌య్యారు.

Admin

Recent Posts