Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మీరు ఎంత‌గానో ప్రేమించే వ్య‌క్తులను క‌చ్చితంగా ఓసారి కౌగిలించుకోండి.. త‌రువాత ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు..

Admin by Admin
May 18, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒక్కోసారి మన ఊహకే అందని విధంగా జరుగుతుంటాయి ఘటనలు. ఏదో పిడుగు అమాంతం పడ్డట్టుగా జీవితం పెద్ద కుదుపుకి గురవ్వుతుంది. ఆ ఘటన నుంచి తేరుకోవడానికే చాలా టైం పడుతుంది. పైగా అందులోంచి బయటపడతామని అనుకోం కూడా. అలాంటి పరిస్థితే ఎదురైంది ఢిల్లీకి చెందిన ఈ వ్యక్తికి. గుర్తొచ్చినప్పుడల్లా..ఎంత పొరపాటు చేశాను అనే గిల్టీ ఫీలింగ్‌ వెన్నాడుతుందంటూ భావోద్వేగంగా పోస్ట్‌ పెట్టాడు. అది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. లింక్డ్‌ఇన్‌లో ఢిల్లీకి చెందిన ప్రతాప్‌ సుతాన్‌ అనే వ్యక్తి గుండెల్ని మెలిపెట్టేలా ఓ పోస్ట్‌ పెట్టాడు. తన చివరి హగ్‌ గురించి మాట్లాడారు. ఆ రోజు ఆ ఆలింగనం చాలా సాధారణమైనది గానీ, ఇప్పుడు తలుచుకున్నప్పుడల్లా గుండె బరువెక్కిపోతుందని వాపోయాడు. అస్సలు అలా జరుగుతుంనదని ఎవ్వరూ ఊహించలేరు అంటూ తాను ఎదుర్కొన్న‌ విషాదకర అనుభవాన్ని పంచుకున్నాడు.

ఒకరోజు త‌న‌ భార్యకి బాగోలేదని ఆస్ప్రతికి తీసుకువెళ్తున్నాడు. ఇంతలో వెళ్లే ముందు ఎప్పటిలానే ఆమెకు ఏం కాదని ధైర్యం చెబుతూ హగ్‌ చేసుకుని మరీ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. చాలా నార్మల్‌గా హగ్‌ చేసుకున్నాడు. కానీ అదే తాను తన భార్యకిచ్చే చివరి హగ్‌ అని గ్రహించలేకపోతాడు. ఆ రోజు ఆస్పత్రికి వెళ్లడం.. పరిస్థితి విషమించడం, చనిపోవడం అన్ని క్షణాల్లో తన కళ్లముందే జరిపోయాయి. అయితే అది నేను చివరి వీడ్కోలు అని తెలియక చాలా సాదాసీదాగా నా భార్యను కౌగలించుకన్నా. అది కూడా ..కేవలం ఆమెకి అంతా బాగానే ఉంటుందని ఆశను కలిగించే ఉద్దేశ్యంతో హగ్‌ చేసుకున్నదే. కానీ తన భార్య మాత్రం అదే చివరిసారి అని గ్రహించే ఉంది కాబోలు..అంటూ భావోద్వేగంగా పోస్ట్‌ పెట్టారు. అంతేగాదు ఎన్నోసార్లు నా భార్యను హగ్‌చేసుకున్నా..కానీ ఏది గుర్తుకు రాదు..కానీ ఈ ఆలింగనం..చచ్చేంతవరకు అంటిపెట్టుకునేలా మోస్తున్నా అని బాధగా అన్నారు.

we must hug once our loved ones know why

ఆ ఘటన గుర్తొచ్చినప్పుడల్లా ప్రాణం పోతున్నంత బాధగా ఉంటుందన్నారు. మనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు లేదా మనం బాగా కనెక్ట్‌ అయ్యే వ్యక్తులు మిస్‌ అవ్వక ముందే ఒక్కసారి గాఢంగా హగ్‌ చేసుకోండని అన్నారు. అలాగే స్పర్శ శక్తిని గురించి కూడా వివరించారు. ప్రేమ లేదా కోల్పోయిన వాటి స్థితిస్థాపకతను వ్యక్తపరిచేదీ ఈ కౌగలింతేనని అన్నారు. అవి ఎలా ఉంటాయంటే..వృద్ధ తల్లిదండ్రులు తమ బిడ్డను దగ్గరకి తీసుకోవడం, తల్లి తన కొడుకును యుద్ధానికి బయలుదేరే ముందు ప్రేమగా హగ్‌చేసుకోవడం, ప్రేమికులు చాలా కాలం విడిపోయిన తర్వాత తిరిగి కలుసుకునేటప్పుడూ లేదా నిరాశ క్షణాల్లో నిశ్శబ్ద బలాన్ని అందించేలా వెన్నుతడుతున్నట్లుగా దగ్గరగా చేరదీసి హగ్‌ చేసుకోవడం వంటివని అన్నారు.

చివరిగా తన భార్య తన నుంచి దూరమైపోతుందని తెలియక..హగ్‌ చేసుకున్న ఘటన జీవితాంత మర్చిపోలేనని, తాను ఉన్నంత వరకు మధురమైన జ్ఞాపకమే అని అన్నారు సుతాన్‌ పోస్ట్‌లో. అయితే నెటిజన్లుంతా చాలా మంచి పోస్ట్‌ పెట్టారు..ఒక కౌగిలింత జీవితాంతం భావోద్వేగాలను నిలుపుకోగలదని గుర్తుచేయడమేగాక, ముఖ్యమైన బంధాలకు ప్రాముఖ్యత ఇవ్వాలనేది హైలెట్‌ చేశారని ప్రశంసిస్తూ.. పోస్ట్‌లు పెట్టారు.

Tags: huglove
Previous Post

చిన్న చీమలే పెద్ద రాయిని కదిలించగలవు.. కష్టాలు చుట్టుముట్టినప్పుడు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివి..

Next Post

తెలంగాణ‌లో మ‌ద్యం ప్రియుల‌కు షాక్‌.. భారీగా పెరిగిన మ‌ద్యం ధ‌ర‌లు..

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!