ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల మధ్య ప్రస్తుతం తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. గత 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి కాస్త బ్రేక్ పడింది. అలాగే ఇజ్రాయెల్‌కు, హమాస్ కు మధ్య జరుగుతున్న యుద్ధం కూడా కాస్త విరామం తీసుకుంది. ఇక 3- 4 రోజుల పాటు భారత్, పాక్‌ల మధ్య చిన్నపాటి యుద్ధం జరిగి కాస్త బ్రేక్ పడింది. అయినప్పటికీ ఆయా దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితి మారింది. ప్రస్తుతం యుద్ధాలకు బ్రేక్ పడినా కూడా వాతావరణం మాత్రం ఉద్రిక్తంగానే ఉంది. అలాగే ఆయా దేశాలు కూడా అణుబాంబులను ప్రయోగిస్తామనే హెచ్చరికలు చేశాయి. దీంతో అణుబాంబులతో యుద్ధం జరిగితే అసలు ప్రపంచంలో సురక్షితంగా ఉండే దేశాలు ఏవి.. అని ప్రజలు తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
అణు యుద్ధం జరిగితే ప్రపంచంలోని సురక్షితంగా ఉండే దేశాల్లో భూటాన్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే భూటాన్ చుట్టూ చాలా పర్వత శ్రేణులు ఉంటాయి. ఆ పర్వతాలను దాటుకుని వచ్చి మిస్సైల్స్ ఏమీ చేయలేవు. అందువల్ల ఈ దేశాన్ని చాలా సురక్షితంగా చెప్పవచ్చు. పైగా ఈ దేశం 1971 నుంచి ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశంగా ఉంది. ఇప్పటి వరకు ఏ యుద్ధంలోనూ ఎవరికీ సపోర్ట్ చేయలేదు. తటస్థంగానే ఉంది. కనుక అణుబాంబులతో యుద్ధం జరిగితే భూటాన్ చాలా సురక్షితం అని చెప్పవచ్చు. అలాగే ఇండోనేషియా కూడా చాలా సురక్షితమైన దేశంగా చెప్పబడుతుంది. వీరు కూడా ఇప్పటి వరకు ఎలాంటి యుద్ధంలో పాల్గొనలేదు. ఎవరికీ సపోర్ట్ చేయలేదు.
అంతర్జాతీయ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌లలో స్విట్జర్లాండ్ కూడా ఒకటి. ఏటా కొన్ని లక్షల మంది పర్యాటకులు స్విట్జర్లాండ్ వెళ్తుంటారు. అయితే ఈ దేశం కూడా యుద్ధంలో ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు. ఇక అణు యుద్ధం జరిగితే తమ ప్రజలను కాపాడుకునేందుకు ఈ దేశం ఏకంగా బంకర్లను పెద్ద ఎత్తున నిర్మిస్తోంది. అలాగే ఈ దేశం చుట్టూ కూడా పర్వతాలు ఉన్నాయి. కనుక స్విట్జర్లాండ్ కూడా సురక్షిత దేశంగా చెప్పవచ్చు. న్యూజిలాండ్ కూడా అనేక పర్వతాలను కలిగి ఉంటుంది. వీరు యుద్ధంలో ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు. ఈ దేశాన్ని కూడా సురక్షితంగా చెబుతున్నారు. ఐస్ ల్యాండ్ కూడా చుట్టూ అనేక పర్వతాలను కలిగి ఉంటుంది. వీరు యుద్ధాన్ని సపోర్ట్ చేయరు. అణు యుద్ధం జరిగితే ఈ దేశం కూడా సురక్షితంగా ఉంటుంది.