Surya Namaskar : చాలా మంది ప్రతి రోజూ వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సూర్య నమస్కారాలు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందిస్తాయి. ఈ 12 ఆసనాలని వేయడం వలన విష పదార్థాలు కరిగిపోతాయి. దేహ కదలికలు సులువు అవుతాయి. కీళ్లు వదులు అవడం, నరాల, కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేయడం జరుగుతాయి. అలాగే శరీరంలో బిగువులు తొలగిపోతాయి. దృష్టి, వినికిడి, వాసన, రుచి యొక్క శక్తులు పెరుగుతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం తేలికగా అవుతుంది. శక్తివంతంగా అవుతుంది. దేహంలో వ్యవస్థలన్నీ కూడా మెరుగుపడతాయి. సూర్య నమస్కారాలు చేయడం వలన జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. ఆలోచనలో స్పష్టత వస్తుంది. భావవ్యక్తీకరణలు, ప్రజ్ఞా కలుగుతాయి. సూర్య నమస్కారాలు చేయడం వలన శరీరం ఒకే విధమైన విశ్రాంతిని పొందుతుంది. సూర్య నమస్కారాలని సక్రమంగా చేస్తే ప్రణామ ప్రవాహంగా అవిచ్ఛిన్నంగా సాగుతుంది.
మెడ ముందుకి, వెనుకకి, పైకి, కిందకి ప్రధానంగా కదులుతుంది. సూర్య నమస్కారాలు చేస్తుంటే ఏడు ప్రధాన చక్రాలని చైతన్యవంతం చేస్తాయి. మీరు సూర్య నమస్కారాలు చేయాలనుకుంటే కచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సమయం కూర్చుని పని చేసే వాళ్ళు, చెడు రక్తం, జీర్ణ సమస్యలు కలిగిన వాళ్ళు పవనముక్తాసన శ్రేణి భంగిమను మెల్లగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టి ఆ తర్వాత మీరు సూర్య నమస్కారాలు చేస్తూ రావాలి.
ఇలా చేయడం వలన ఇబ్బంది ఉండదు. నెమ్మదిగా మీరు సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలలోని కదలికలని అనువుగా శరీర భాగాలు సర్దుకుంటాయి. అలా చేయకపోతే కీళ్ల నొప్పులు, జ్వరం, పాదాల వాపు, చర్మం పగిలిపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. జ్వరం, అల్సర్స్ వంటి సమస్యలు వున్నవాళ్లు సూర్య నమస్కారాలు చేయకూడదు.