lifestyle

Thalalo Rendu Sudulu : త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా ? ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుందా ?

Thalalo Rendu Sudulu : పూర్వ‌కాలం నుంచి మ‌నం అనేక విశ్వాసాల‌ను న‌మ్ముతూ వ‌స్తున్నాం. పెద్ద‌లు వాటిని మ‌న‌కు చెబుతూ వ‌స్తున్నారు. అయితే కొన్ని విశ్వాసాలు నిజం అవుతుంటాయి. అలాంటి వాటిలో ఒక‌టి.. త‌ల‌లో రెండు సుడులు. ఈ విధంగా ఉన్న‌వారికి రెండు పెళ్లిళ్లు అవుతాయ‌ని.. ఇద్ద‌రు భార్య‌లు ఉంటార‌ని.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంద‌ని.. చెబుతుంటారు. మ‌రి దీనికి పండితులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారు.. అంటే..

త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు కావు. పెద్ద‌లు ఆ విధంగా సామెత చెబుతూ ఉంటారు కానీ.. శాస్త్రాల ప్ర‌కారం.. త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయ‌ని.. ఎక్క‌డా చెప్ప‌లేదు. అలా ఎక్క‌డైనా జ‌రిగితే అది యాదృచ్ఛిక‌మే. కానీ ఈ విష‌యం నిజం కాదు.

what happens if you have thalalo 2 sudulu

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాత్రం త‌ల‌లో రెండు సుడులు ఉండ‌డం అదృష్టాన్ని తెచ్చి పెడుతుంద‌ని అంటున్నారు. ఎందుకంటే ఈ విధంగా ఉన్న‌వారు సాధార‌ణ వ్య‌క్తుల క‌న్నా భిన్నంగా ఆలోచిస్తారు. భ‌విష్య‌త్ ప్రణాళిక‌ల‌పై దృష్టి ఎక్కువ‌గా ఉంటుంది. ముందు చూపుతో వ్య‌వ‌హ‌రిస్తారు. అనేక విష‌యాల‌లో వారు ఆచి తూచి నిర్ణ‌యాలు తీసుకుంటారు. అవి వారికి మేలు చేస్తాయి. అలాగే ఏ విష‌యంలో అయినా స‌రే దూర‌దృష్టి ఎక్కువ‌గా ఉంటుంది. సాధార‌ణంగా ఈ వ్య‌క్తులు అంత సుల‌భంగా మోస‌పోరు. మోస‌గించే గుణం కూడా ఉండ‌దు. క‌ష్ట‌ప‌డి పైకి వ‌స్తారు.

త‌ల‌లో రెండు సుడులు ఉన్న‌వారు మిగిలిన వారి క‌న్నా భిన్నంగా ఆలోచిస్తారు. ఎల్ల‌ప్పుడూ సృజ‌నాత్మ‌క‌త‌ను కోరుకుంటారు. చురుగ్గా ఉంటారు. వీరికి జీవితంపై ఒక స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉంటుంది. వీరు జీవితంలో ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకునేందుకు, ఏ రంగంలో అయినా రాణించేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని.. జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంతేకానీ.. త‌ల‌లో రెండు సుడులు ఉన్నంత మాత్రాన రెండు పెళ్లిళ్లు మాత్రం కావు.

Admin

Recent Posts