Ragi Ungaram : చాలా మంది చేతికి ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు. బంగారు ఉంగరం, వెండి ఉంగరం కాకుండా రాగి ఉంగరాన్ని కూడా చాలా మంది పెట్టుకుంటారు. నిజానికి రాగి ఉంగరం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని పొందొచ్చు. రాగి ఉంగరాన్ని మీరు కూడా ధరించినట్లయితే ఈ విషయాలని కచ్చితంగా తెలుసుకోండి.
రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన చింతలన్నీ తొలగిపోతాయి. సానుకూల అనుభూతిని కలిగిస్తుంది రాగి ఉంగరం. అలానే కోపం కూడా కంట్రోల్ లో ఉంటుంది. కోపం ఎక్కువగా వచ్చే వాళ్ళు రాగి ఉంగరాన్ని ధరిస్తే కోపం కంట్రోల్ అవుతుందని వేద శాస్త్రంలో చెప్పబడింది. సూర్యుడు, కుజుడు జాతకంలో అనుకూల స్థితిలో ఉండాలంటే రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం మంచిది. దాని వలన చెడు ప్రభావం తగ్గుతుంది. వ్యక్తిత్వ వికాసానికి కూడా రాగి ఉంగరాన్ని ధరించడం ఎంతో మంచిది.
రాగి ఉంగరాన్ని ఏ వేలికి పెట్టుకుంటే మంచిదనే విషయానికి వస్తే.. ఉంగరం వేలికి రాగి ఉంగరాన్ని పెట్టుకోండి. పురుషులు కుడి చేతి ఉంగరపు వేలికి, స్త్రీలైతే ఎడమ చేతి ఉంగరపు వేలికి పెట్టుకుంటే మంచిది. రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన అది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి రాగి ఉంగరం చాలా బాగా ఉపయోగపడుతుంది.
రాగి ఉంగరాన్ని కానీ, ఆభరణాలను కానీ పెట్టుకుంటే అందం బాగా పెరుగుతుంది. ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి ఇబ్బందులు రాగి ఉంగరాన్ని ధరించడం వలన తొలగిపోతాయి. లేదంటే మీరు రాగి కడియం వంటివి కూడా పెట్టుకోవచ్చు. ఎముకలు రాగి వలన బలంగా మారుతాయి. ఎముకల సమస్యలు రావు. ఇలా ఈ సమస్యలేమీ లేకుండా రాగి చూస్తుంది.