చాలా సందర్భాలలో బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వలన యాక్సిడెంట్లు అయ్యాయి అని వింటూ ఉంటాము. అయితే అలాంటప్పుడు కార్ ను ఎలా కంట్రోల్ చేయాలి అనే ప్రశ్న వస్తుంది. హై స్పీడ్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఒకవేళ కార్ బ్రేక్స్ ఫెయిల్ అయితే ఏం చేయాలి అనే దాని గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే సడన్ గా బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఎంతో ప్రమాదకరమైన సంఘటనలు జరగవచ్చు. కనుక దీని గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. మీ కార్ బ్రేక్స్ ఫెయిల్ అయినా సరే మీ కార్ ను కంట్రోల్ చేయవచ్చు.
ఎలాంటి కంగారు పడకుండా, కొంచెం ప్రశాంతంగా ఉండాలి. యాక్సిలరేటర్ ను రిలీజ్ చేసి ఉంచడంతో కార్ స్పీడ్ తగ్గుతుంది. అలా కొంత సమయానికి స్పీడ్ మొత్తం తగ్గిపోతుంది. కార్ బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు హ్యాండ్ బ్రేక్ ను నెమ్మదిగా ఉపయోగించవచ్చు. కాకపోతే హ్యాండ్ బ్రేక్ ను సడన్ గా వేయకూడదు. ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీంతో కంట్రోల్ తప్పవచ్చు.
ఒకవేళ మీరు మాన్యువల్ కార్ ను ఉపయోగిస్తున్నట్లయితే లో గేర్ కు షిఫ్ట్ అవ్వాలి. ఆటోమేటిక్ కారు అయితే షిఫ్టర్ ను ఎల్ లేక ఒకటి లో పెట్టాలి. ఇలా చేయడంతో కార్ స్లో అవుతుంది మరియు ఇంజన్ ఆగుతుంది. ఇలా చేసిన తర్వాత స్పీడ్ తగ్గిన తరువాత సురక్షితమైన ప్రదేశంలో కారు ఆపితే ఎటువంటి ప్రమాదం ఉండదు.