నేను వారణాసికి చాలాసార్లు వెళ్లాను. నా అనుభవం ప్రకారం చెప్పాలి అంటే.. కాశి అన్నపూర్ణమ్మ టెంపుల్ నుంచి విశాలాక్షి అమ్మ టెంపుల్ కి వెళ్లే దారిలో చాలా షాపులు ఉంటాయి. అక్కడ చాలా బాగుంటాయి చీరలు. అది కాకుండా టెంపుల్ రెండవ గేట్ నుంచి కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్లే దారిలో కూడా చాలా షాపులు ఉన్నాయి. అక్కడ తీసుకున్నా ఫర్వాలేదు.
కాశీ విశ్వేశ్వర దేవాలయం నుంచి దశ అశ్వమేధ ఘాట్ కి వెళ్లే దారిలో కూడా గల్లీలలో చాలా షాపులు ఉంటాయి. అలా కాకుండా దశ అశ్వమేధ ఘాట్ దగ్గరలో కూడా కొన్ని షాపులు ఉంటాయి.
ఇక పూర్తిగా మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే సోనా బజార్లో షాపింగ్ చేయడం బెటర్. అక్కడైతే మంచి చీరలు లభిస్తాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం బెనారస్ చీరల గురించి పూర్తి అవగాహన ఉంటేనే అక్కడ షాపింగ్ చేయడం బెటర్ . ఎందుకంటే చాలా అందంగా చాలా అద్భుతంగా మోసం చేస్తారు చాలా షాపుల వాళ్లు. కాబట్టి ఈ చీరల గురించి ముందుగా తెలుసుకుని కొంటే బెటర్.