పెళ్ళి…లేదా విడాకులు….రెండూ కూడా బరువు పెంచేస్తాయంటున్నారు పరిశోధకులు. 1986 2008 సంవత్సరాల మధ్య 30 ఏళ్ళు పైబడ్డ 10,000 మందిని పరిశీలించిన పరిశోధకులు పెళ్ళి లేదా విడాకులు రెండూ కూడా అధిక బరువు కలిగిస్తున్నాయని తేల్చారు. 30 సంవత్సరాల లోపు వరకు వ్యక్తులకు బరువులో పెద్దగా తేడా లేదని, 30 నుండి 50 సంవత్సరాలవరకు బరువు ఎంతో నిలకడగా పెరిగిందని పరిశోధనలు తెలుపుతున్నాయని ది డైలీ టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించింది.
అయితే, పురుషులకు డైవోర్సు, మహిళలకు పెళ్ళి జరిగిన రెండు సంవత్సరాలలో ఆరోగ్యానికి హానికరమైన గణనీయ బరువు పెరిగినట్లు తెలుపుతున్నాయి. పెళ్ళికి, విడాకులకు మాత్రమే ఈ బరువు పెరగటం దేనికనే కారణాలు స్టడీకే అందటం లేదు. అధ్యయనకారులు ఈ అంశంపై తమ రీసెర్చి కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. అయితే వివాహిత స్త్రీలు పెళ్ళి తర్వాత వ్యాయామలకు సమయం కేటాయించలేరన్న కారణంగాను, పురుషులకు పెళ్ళి తర్వాత ఆరోగ్య లాభం చేకూరుతుందని, ఒకసారి డైవోర్సు తీసుకుంటే ఆ లాభం పోయి బరువెక్కువై అనారోగ్యాలపాలు కూడా అవుతున్నారని అధ్యయన బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జంచావో కియాన్ పేర్కొన్నారు.
వివాహ స్ధితి శారీరక ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుందనేది సైంటిఫిక్ గా రుజువైంది. కనుక బరువు పెరగకుండా తమ తమ ఆరోగ్యాల్ని కాపాడుకొనటానికైనా సరే పురుషులు విడాకుల మాట ఎత్తరాదేమో!