కుక్కలను పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. దీనికి ముఖ్యమైన కారణంగా.. మిగతా జంతువల కంటే కుక్కలకు చాలా విశ్వాసం ఉంటుంది. కొన్ని తెలివైన కుక్కలు యజమాని ఏం చెబితే అది మాత్రమే చేస్తాయి. ఒక కుక్కల్లో చాలా బ్రీడ్స్ కూడా ఉంటాయి. కొన్ని పొట్టిగా.. ఉంటే.. కొన్ని పొడుగ్గా ఉంటాయి.
వేల నుంచి లక్షల ధరలు ఉండే కుక్కలు కూడా ఉన్నాయి. అంత ఖర్చు పెట్టి కొన్న కుక్కలను యజమానులు ఎంత ముద్దుగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. ఈ కుక్కలు కదులుతున్న వాహనాలను వెంబడిస్తూ ఉంటాయి. అసలు అవి ఎందుకు అలా వెంబడిస్తాయో ఇప్పుడు చూద్దాం.
కుక్కలు పెంపుడు జంతువులు. వారి యజమానులు తమ, తమ వాహనాలను తీసుకుని.. బయటకు వెళితే.. ఎంతో ప్రేమ చూపిస్తూ.. వారి వెంబడి పరుగెత్తుతాయి కుక్కలు. వారి యజమానులు క్షేమంగా రావాలని.. సంకేతం ఇస్తూ.. ఆ కుక్కలు పరుగెత్తుతాయట.
ఇక వీధి కుక్కలు అయితే.. ఏదైనా వెహికిల్ ఫాస్ట్ గా లేదా.. అధిక ధ్వని చేస్తూ.. వెళితే.. వారి వెనుక పరుగెడుతాయి. అలాంటి శబ్దాలు, స్పీడ్ గా వెళ్లే వాహనదారులను దొంగలుగా భావించి.. వారిని పట్టుకునేందుకు.. కుక్కలు వెంబడిస్తాయి. ఇలాంటి సమయంలో.. ఆ వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కుక్కలు ఉన్న చోట.. వాహనాలు నెమ్మదిగా వెళితే.. చాలా మంచింది.