lifestyle

చిలక కొట్టిన పండు తియ్యగా ఎందుకుంటుందో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">చిలక కొట్టిన పండు చాలా తియ్యగా ఉంటుంది&period; ఈ విషయం మనలో చాలా మందికి తెలిసినదే&period;&period;ఇంకా చెప్పాలంటే మనకు అనుభవమే&period; జామ చెట్టెక్కిన ప్రతిసారీ…&period;&period;చిలకకొట్టిన పండ్లను గమనించి మరీ …&period;అది కొట్టిన ప్రాంతం వరకు పక్కకు పెట్టి మిగితాది లాగించేస్తాం&period; అయితే చిలక కొట్టిన పండే ఎందుకు తియ్యగా ఉంటుంది అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా&quest; అయితే దాని వెనకున్న అసలు లాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇందులో ఉన్న చిన్న లాజిక్ ఏంటంటే…&period;&period; చిలుకలు కొట్టిన పండ్లు తియ్యగా ఉండవు&comma; తియ్యగా ఉన్న పండ్లనే చిలుకలు కొడతాయి&period; కాబట్టి చిలకకొట్టిన ప్రతిపండు తియ్యగా ఉంటుంది&period; సాధారణంగా చిలుకలు ఎక్కువగా పండ్ల చెట్ల మీదుంటాయి&period; ఇదే సమయంలో పండ్లను ఇచ్చే ప్రతి చెట్టు&period;&period; 5 రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది&period; అవి&period;&period; 1&period; ఆక్సిన్లు 2&period; జిబ్బరెల్లిన్లు 3&period; సైటోకైనిన్లు 4&period; ఇథిలిన్ 5&period; అబ్‌సిసిక్ ఆమ్లం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86064 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;parrot-eating-fruit&period;jpg" alt&equals;"why parrot eaten fruit is very sweet " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ అయిదు హార్మోన్లలో ఇథిలిన్ పండ్లను త్వరగా పక్వానికి వచ్చేలా ప్రేరేపిస్తుంది&period; ఇథిలిన్ ఓ రకమైన వాసనతో ఉంటుంది&period; చిలుకలు వాటిని కనిపెట్టి…ఇథిలిన్ సహాయంతో పక్వానికి రాబోతున్న పండును తినే ప్రయత్నం చేస్తాయి&period; పరిమాణాన్ని బట్టి చిలుక కొంచెం తినగానే…&period;దానికి సరిపోతుంది మిగితాది వదిలిపెడుతుంది&period; అందుకే చిలకకొట్టిన పండు తియ్యగా ఉంటుంది అనే కంటే తియ్యగా ఉండే పండునే చిలకకొడుతుంది అంటే సరిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts