Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Train Tracks Stones : రైల్వే ట్రాక్స్ కింద‌, చుట్టూ కంక‌ర రాళ్ల‌ను ఎందుకు పోస్తారో తెలుసా..?

Admin by Admin
November 17, 2024
in lifestyle, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Train Tracks Stones : రైలు ప‌ట్టాల ప‌క్క‌న మీరెప్పుడైనా న‌డిచారా..? న‌డిచాం.. అయితే ఏంటంటారా..? ఏమీ లేదండీ.. రైలు ప‌ట్టాల ప‌క్క‌న కంక‌ర రాళ్ల‌పై న‌డుస్తుంటే నిజంగా అదోలాంటి ఫీలింగ్ కలుగుతుంది. య‌మ వేగంగా దూసుకువ‌చ్చే రైళ్ల చ‌ప్పుడుకు ఆ స‌మ‌యంలో హ‌డ‌లిపోతాం. అయినా ట్రాక్‌పై ఉండే రాళ్ల మీద న‌డ‌వడం అంత ఆషామాషీ కాదు. అయితే.. నిజానికి అస‌లు ట్రెయిన్ ట్రాక్స్ మ‌ధ్య‌లో, ప‌క్క‌న, చుట్టూ.. ఆ మాటకొస్తే ట్రాక్ మొత్తం కంక‌ర రాళ్ల‌తో ఎందుకు నిండి ఉంటుందో తెలుసా..? అస‌లు కంక‌ర రాళ్ల‌ను ట్రాక్స్ కింద ఎందుకు పోస్తారో, వాటిని క్ర‌మ‌బ‌ద్ధంగా ఎందుకు అమ‌రుస్తారో తెలుసా..? అదే తెలుసుకుందాం రండి..!

రైలు ట్రాక్ కింద‌, చుట్టూ ఉండే కంక‌ర రాళ్ల‌ను బ‌ల్లాస్ట్ అంటారు. అయితే ఇప్పుడంటే ట్రాక్స్ మ‌ధ్య‌లో కాంక్రీట్ దిమ్మ‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు కానీ, ఒక‌ప్పుడు చెక్క దిమ్మ‌లు ఉండేవి. ఈ క్ర‌మంలో కాంక్రీట్ అయినా, చెక్క దిమ్మ‌లైనా, వాటిని చిత్రంలో ఇచ్చిన విధంగా స్లీప‌ర్స్‌తో ఒక‌దానికొక‌టి ఫిట్ చేస్తారు. దాంతోపాటు ప‌ట్టాల‌కు దిమ్మ‌ల‌ను కూడా అమ‌రుస్తారు. అయితే ఇలా అమ‌ర్చాక ఆ దిమ్మ‌లు, ప‌ట్టాలు స‌రైన పొజిష‌న్‌లో ఉండేందుకు గాను చుట్టూ, కింద కంక‌ర రాళ్ల‌ను పోసి వాటిని స‌మం చేస్తారు. దీంతో ప‌ట్టాలు, దిమ్మ‌లు, స్లీప‌ర్స్ ఒకే స్థానంలో ఫిక్స్ అయి ఉంటాయి. అవి అటు, ఇటు క‌ద‌ల‌వు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

why stones are put near railway tracks

మ‌రి.. ప‌ట్టాల ప‌క్క‌న కూడా కంక‌ర రాళ్లను పోస్తారు క‌దా.. అంటే అందుకూ కార‌ణం ఉంది. సాధార‌ణంగా రైల్వే ట్రాక్ మొత్తం భూమిపై కొంత ఎత్తులో కంక‌ర రాళ్ల మీద ఏర్పాటు చేయ‌బ‌డి ఉంటుంది. దానికి తోడు ట్రాక్స్ ప‌క్క‌న ఎత్తుగా కంక‌ర‌ను పోస్తారు. అలా పోయ‌డం వ‌ల్ల వ‌ర్షం ప‌డిన నీరు సుల‌భంగా భూమిలోకి వెళ్లిపోతుంది. ట్రాక్‌పై నీరు నిల‌వ‌దు. దీంతో రైళ్లు సుల‌భంగా వెళ్ల‌వ‌చ్చు. వ‌ర‌ద‌కు ట్రాక్‌ కొట్టుకుపోకుండా ఉండేందుకు కూడా అలా కంక‌ర రాళ్ల‌ను ఏర్పాటు చేస్తారు. అలా చేయ‌డం వ‌ల్ల మొక్క‌లు కూడా పెర‌గవు. కింద చెత్త పేరుకుపోదు. ట్రాక్స్ క్లియ‌ర్‌గా క‌నిపిస్తాయి. అందుక‌నే రైల్వే ట్రాక్స్ కింద, చుట్టూ అంతా కంక‌ర రాళ్ల‌ను ఏర్పాటు చేస్తారు. ఇవీ.. దాని వెనుక ఉన్న అస‌లు కార‌ణాలు..!

Tags: Train Tracks Stones
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Touching Elders Feet : పెద్ద‌వాళ్ల పాదాల‌కు న‌మస్కారం చేయ‌డం వెనుక ఉన్న కార‌ణాలు ఇవే..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.