Feet : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని అనేక మార్గాలని చూస్తూ ఉంటారు. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నారా..? ఆరోగ్యం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా దీనిని మీరు చూడాల్సిందే. మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా..? ఇలాంటివి మీ పాదాలు క్లియర్ గా చెప్పేస్తాయి.
పాదాలను బట్టి మనం శరీరంలో జరిగే మార్పుల గురించి, శరీరానికి వచ్చిన సమస్యల గురించి చెప్పవచ్చు. విటమిన్ లోపాల నుండి థైరాయిడ్ సమస్యల వరకు అనేక వాటిని పాదాలు చెప్పేస్తాయి. మీ కాళ్లు, కాళ్ళ వేళ్ళ మీద వెంట్రుకలు లేవంటే రక్త ప్రసరణ సరిగ్గా లేదని దానికి అర్థం. పాదాల మీద వెంట్రుకలు కనుక రాలిపోతున్నట్లయితే రక్తప్రసరణ సరిగా లేదని మీరు తెలుసుకోవచ్చు. అలాగే చీలిమండల మీద నాడి పట్టుకుని చూడాలి. నాడి కొట్టుకోకపోతే వైద్యుడిని సంప్రదించాలి.
పాదం ఎప్పుడు చల్లగా వున్నా, పొడి చర్మం, పొడి జుట్టు, అలసట, సడెన్ గా బరువు పెరిగిపోవడం ఇలాంటివి జరుగుతూ, హైపోథైరాడిజమ్ లక్షణాలు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. ఆర్థరైటిస్ కనుక ఉన్నట్లయితే పుండ్లు కలగడం, వాపులు రావడం, కాలి బొటన వేలు దగ్గర మార్పులు రావడం వంటివి కనపడతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లలో కాలి వేళ్లలో వాపు ఉంటుంది. ఇలా పాదాల్లో జరిగే మార్పుల ద్వారా మనం అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చు.
రక్త ప్రవాహంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే ఆర్థరైటిస్ వస్తుంది. పాదాలు కొంతమందికి ఉబ్బుతూ ఉంటాయి. దీని వెనుక కారణం ఏంటంటే శుభ్రం పాటించకపోవడం. పాదాలను తరచుగా కడుగుతూ ఉండాలి. సాక్సులు వేసుకోవడం వంటివి చేయాలి. కూర్చోవడం, నిలబడడం ఇబ్బందిగా ఉంటే కాల్షియం సరిగ్గా పొందలేకపోతున్నారని అర్థం చేసుకోవాలి. నడవడానికి ఇబ్బందిగా ఉంటే కచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. తరచూ కండరాలు తిమ్మిరెక్కుతున్నట్లయితే విటమిన్ లోపం, డీహైడ్రేషన్ అని గ్రహించాలి. రక్త ప్రవాహంలో క్యాల్షియం, పొటాషియం, సోడియం తక్కువ ఉంటే కండరాల తిమ్మిరి కలుగుతుంది. నొప్పి కూడా పెడుతుంది. ఇలా పాదాలలో కనిపించే ఈ లక్షణాలని బట్టి మీరు అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చు.