వైద్య విజ్ఞానం

గ‌ర్భిణీల్లో వ‌చ్చే డ‌యాబెటిస్ స‌మ‌స్య‌.. త‌ప్ప‌కుండా ప‌రిశీలించాల్సిన అంశాలు..!

గర్భిణీ స్త్రీలకు వచ్చే డయాబెటీస్ పై అధిక జాగ్రత్త వహించాలి. మహిళకు వైద్యం చేసే వైద్యురాలు, డయాబెటీస్ నిపుణుడు ఇరువురూ కూడా సన్నిహితంగా పరిశీలించాలి. డయాబెటిక్ ప్రెగ్నెన్సీలు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది ముందే డయాబెటీస్ వుండి గర్భం రావటం కాగా రెండోది గర్భం ధరించిన తర్వాత మహిళ డయాబెటీక్ గా కనుగొనటం. ఈ సమాచారం సాధారణంగా సాధారణ వైద్య పరీక్షలలో బయట పడుతుంది. గర్భం ధరించిన తర్వాత డయాబెటీస్ గా కనుగొంటే, కాన్పు అయిన ఆరు నెలల తర్వాత ఆ డయాబెటీస్ పోయిందా లేదా అనేది నిర్ధారించుకోవాలి.

గర్భ ధారణ సమయంలో వచ్చే డయాబెటీస్ కు కారణాలు చెప్పాలంటే, అధిక బరువు, కుటుంబంలోని డయాబెటీస్ చరిత్ర, అధిక బ్లడ్ ప్రెషర్, ప్రెగ్నెన్సీలో గతంలో పెద్ద బేబీ పుట్టటం, 35 సంవత్సరాల పైబడి గర్భం రావటం, లేదా యుటిరస్‌లోనో బేబీ గతంలో చనిపోవడం మొదలైనవిగా వుంటాయి. వైద్యుడు కాబోయే తల్లికి డయాబెటీస్ ను ముందే నిర్ధారించాలి. మహిళ ఆరోగ్యంగా బిడ్డను ప్రసవించటానికి డయాబెటీస్ ను సమర్ధవంతంగా ట్రీట్ చేయాలి. లేకుంటే పుట్టే బిడ్డ శరీరం సైజు సాదారణం కంటే పెద్దిగావుండి సిజేరియన్ అవసరపడవచ్చు.

diabetes in pregnant ladies must know about it

బేబీ బ్లడ్ షుగర్ చాలా తక్కువగా వుంటే దానిని హైపో గ్లైసీమియా అంటారు. తల్లిపాలను వెంటనే తాగిస్తే బేబీకి తగిన గ్లూకోజ్ అందుతుంది. ఒక్కోసారి బేబీకి నేరుగా రక్తంలోకి గ్లూకోజ్ ఇవ్వవలసి వస్తుంది. బేబీ చర్మం పచ్చగాను కళ్లు కామెర్లుగాను వుంటాయి. సరి అయిన వైద్యంతో దీనిని తేలికగా అధిగమించవచ్చు. ఒక్కోసారి బేబీ శ్వాస సరిలేక ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కోక్కపుడు బేబీ రక్తంలో తక్కువ మినరల్స్ స్ధాయి ఏర్పడి కండరాలు బిగిసే ప్రమాదముంది అటువంటపుడు అధిక మినరల్స్ ఇస్తారు.

Admin

Recent Posts