ప్రధానంగా….తరచు మూత్రం రావటం, దాహం వేయటం, ఆకలి అధికంగా వుండటం, బరువు తగ్గటం వంటివి వుంటాయి. టైప్ 2 డయాబెటీస్ ఒక మొండి వ్యాధి. ఇది వస్తే జీవిత కాలం కనీసం పది సంవత్సరాలు తగ్గుతుంది. గుండెకు రెండు నుండి నాలుగు రెట్లు రిస్కు పెరుగుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా వుంటాయి. శరీర భాగాలలో కింది అవయవాలు తొలగించే అవకాశం 20 శాతం అధికంగా వుంటుంది. హాస్పిటల్ అవసరం తరచుగా కలుగుతుంది. చూపు మందగించే అవకాశాలుంటాయి.
కిడ్నీలు విఫలతచెందుతాయి. మతిమరపు కూడా రావచ్చు. సెక్స్ లో ఆసక్తి లోపిస్తుంది. అంగ స్తంభన సమస్యలు వస్తాయి. తరచుగా వ్యాధులకు గురవుతుంటారు. టైప్ 2 డయాబెటీస్ వ్యాధి జీవన విధానం సరిలేనందున, వంశానుగత కారణాలవలన వస్తుంది. కొన్ని కారణాలు నియంత్రించవచ్చు. ఆహారం, అధికబరువు వంటివి నియంత్రించవచ్చు.
కానీ వయసు, జీన్స్, పరంగా వచ్చేవి నియంత్రించలేము. నిద్ర లేమి కూడా టైప్ 2 డయాబెటీస్ కు కారణంగా చెపుతారు. గర్భంలో పిండ దశలో సరైన పోషక ఆహారం లభించకపోయినా ఎదుగుదల లేక టైప్ 2 డయాబెటీస్ కు తర్వాతి భవిష్యత్తులో గురయ్యే అవకాశం కూడా వుందని పరిశోధకులు చెపుతున్నారు.