వైద్య విజ్ఞానం

షుగ‌ర్ ఉన్న‌వారు ఇలా చేయాల్సిందే.. లేదంటే గుండె జ‌బ్బులు వ‌స్తాయి..

షుగర్ వ్యాధి లేనివారికంటే కూడా వున్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా వుంటుంది. రక్తనాళాల అడ్డంకులు రక్తంలో అధికంగా గ్లూకోజ్ వుండటం గుండె కండరాన్ని నష్టపరుస్తాయి. గుండె కొట్టుకోవడం అపసవ్యంగా వుంటుంది. నరాలు సూచించే నొప్పులు అసలైన గుండె పోటును తెలియజెప్పలేవు. కనుక డయాబెటిక్ రోగులు ఒక్కోసారి నొప్పి తెలియని గుండెపోటుతోనే మరణిస్తారు. డయాబెటిక్ రోగులలో గుండెపోటు లక్షణాలు ఎలా వుంటాయంటే… ఛాతీలో అసౌకర్యంగా వుండటం, చేయి, వెన్ను, దవడ, పొట్ట భాగాలలో నొప్పి రావడంగా వుంటాయి.

ఒక్కొకపుడు శ్వాసతీసుకోవటంలో అసౌకర్యం ఏర్పడుతుంది. చెమట పట్టడం, వాంతులు, వికారంగా వుండటంగా వుంటుంది. అయితే మహిళలలో ఈ లక్షణాలు తక్కువగా వుంటాయి. కనుక డయాబెటిక్ రోగులు సంవత్సరానికొకసారి గుండెసంబంధిత వ్యాధులు కలిగించే కొల్లెస్టరాల్, బ్లడ్ ప్రెజర్ వంటివి తప్పక పరీక్షింపజేసుకోవాలి. అందుకుతగిన వైద్యం పొందాలి.

diabetic patients should take care of their heart health

డయాబెటీస్, గుండె జబ్బు రెండూ కూడా ఒకే సమయంలో కలసిమెలసి రోగిని బాధిస్తాయి. వీటిని అరికట్టాలంటే, అవసరమైన వైద్య విధానాలతో పాటు, షుగర్ ను ఎప్పటికపుడు నియంత్రించుకోవాలి. లిపిడ్ నియంత్రణ, పొగతాగటం నిలిపివేయడం, రెగ్యులర్ వ్యాయామాలు, ఆరోగ్యకర ఆహారం వంటివి అత్యవసరం.

Admin

Recent Posts