Urination : మన శరీరం విడుదల చేసే వ్యర్థాల్లో మూత్రం కూడా ఒకటి. కిడ్నీల్లో ఇది తయారవుతుంది. తరువాత మూత్రాశయం గుండా బయటకు వస్తుంది. మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలకు అనుగుణంగా మూత్రం రంగు ఉంటుంది. అయితే మూత్ర విసర్జన చేసే సమయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు కొందరు పలు తప్పులను చేస్తుంటారు. అవి చేయడం వల్ల అనారోగ్య సమస్యలకు, వ్యాధులకు దారి తీస్తుంది. కనుక మూత్ర విసర్జన చేసేటప్పుడు కొన్ని తప్పులను చేయరాదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరు మూత్రాన్ని పూర్తిగా విసర్జించరు. కాస్త మూత్రం మిగిలి ఉండగానే అయిందనిపిస్తారు. ఇలా చేయడం వల్ల మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. మూత్రాశయం సైజు అసాధారణంగా అవుతుంది. దీంతోపాటు మూత్రాశయం వద్ద కండరాలు సాగినట్లు అవుతాయి. ఇది ప్రోస్టేట్ సమస్యలకు దారి తీస్తుంది. అలాగే మూత్రం లీకవుతుంది. మాటిమాటికీ వచ్చినట్లు అనిపిస్తుంది. కనుక మూత్రం వస్తే పూర్తిగా విసర్జించాలి. మూత్రాశయంలో మిగల్చకూడదు.
ఇక కొందరు మూత్రాన్ని గంటల తరబడి అలాగే ఆపుకుంటారు. ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఇది కిడ్నీ స్టోన్లకు దారి తీస్తుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లను కలగజేస్తుంది. కనుక మూత్రం వచ్చిన వెంటనే విసర్జించాలి. ఇక కొందరు అవసరం లేకున్నా మూత్రాన్ని బాగా ఫోర్స్‌తో విసర్జిస్తారు. ఇలా చేస్తే మూత్రాశయంపై ఒత్తిడి పడుతుంది. కనుక ఈ పద్ధతి మానుకోవాలి.
చాలా మంది మూత్ర విసర్జన చేసిన వెంటనే నీళ్లను తాగుతుంటారు. ఇలా చేయరాదు. కాస్త గ్యాప్ ఇవ్వాలి. ఓ 5 నిమిషాలు ఆగి తరువాత నీళ్లను తాగాలి. లేదంటే కిడ్నీలపై భారం పడుతుంది. అలాగే రాత్రి నిద్రకు ముందు తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలి. దీంతోపాటు భోజనం చేసిన వెంటనే మూత్ర విసర్జన చేయడం వల్ల కూడా కిడ్నీలపై భారం పడకుండా ఉంటుంది. ఇక మూత్రం పోసే సమయంలో నొప్పి, మంట అనిపించినా, మూత్రం రంగు మారి వచ్చినా, మూత్రంలో నురుగు కనిపించినా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. దీంతో కిడ్నీలు, మూత్రాశయంను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ జాగ్రత్తలను పాటిస్తే కిడ్నీ, మూత్రాశయ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.