క్యాన్సర్లలో అనేక రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వాటిల్లో లంగ్ క్యాన్సర్ ఒకటి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆరంభంలో అంత గుర్తు పట్టదగిన లక్షనాలను ఏమీ చూపించదు. వ్యాధి ముదిరే కొద్దీ ఒక్కొక్కటిగా లక్షణాలు బయట పడుతుంటాయి. అయితే కొన్ని కేసుల్లో మాత్రం లక్షణాలు ఆరంభంలోనే కనిపిస్తుంటాయి. వాటిని పరిశీలించడం ద్వారా లంగ్ క్యాన్సర్ వచ్చిందనే విషయం మనకు సులభంగా తెలుస్తుంది. మరి లంగ్ క్యాన్సర్ ఆరంభంలో ఉంటే కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కనీసం 3 వారాలుగా దగ్గు ఏమాత్రం తగ్గకుండా నిరంతరాయంగా వస్తూనే ఉంటే అది లంగ్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరికి ఆరంభంలో విపరీతమైన దగ్గు వస్తుంది. ఇది కొన్ని వారాల పాటు అలాగే ఉంటుంది. అందువల్ల దగ్గు ఎంతకూ తగ్గకుండా అలా వస్తూనే ఉంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుంటే అది క్యాన్సర్ అయిందీ, కానిదీ తెలుస్తుంది. దీంతో ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
2. లంగ్ క్యాన్సర్ ఆరంభంలో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కొందరికి పలు ఇతర కారణాల వల్ల కూడా ఇలా అవుతుంది. కానీ ఈ లక్షణం ఎన్ని రోజులు అయినా తగ్గకుండా అలాగే ఉంటే దాన్ని క్యాన్సర్ యేమోనని అనుమానించాలి. వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
3. లంగ్ క్యాన్సర్ ఉన్నవారికి భుజాలు, ఛాతి, వెన్నెముక భాగాల్లో నొప్పులు ఉంటాయి. ఈ విధమైన నొప్పులు ఉంటే దాన్ని లంగ్ క్యాన్సర్‌గా అనుమానించాలి.
4. లంగ్ క్యాన్సర్ వస్తే ఆరంభంలో బాధితుల స్వరం కూడా మారుతుంది. గొంతు నుంచి మాట వచ్చేటప్పుడు అంతకు ముందు కన్నా భిన్నమైన వాయిస్‌లో మాట వినిపిస్తుంది. వాయిస్ మారుతుంది. ఇలా జరుగుతుంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి.
5. క్యాన్సర్ వచ్చిన వారు సడెన్‌గా బరువు తగ్గుతారు. క్యాన్సర్ కణాల పెరుగుదల వల్ల అధిక బరువు సడెన్‌గ తగ్గుతారు. ఈ విధంగా జరిగితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. దీంతో క్యాన్సర్‌ను ఆరంభంలోనే గుర్తించి తగిన సమయంలో చికిత్స అందించవచ్చు. తద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు.