High Cholesterol Symptoms : ఈమధ్య కాలంలో చాలా మంది అస్తవ్యవస్తమైన జీవనశైలి కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు చాలా మందికి వస్తున్నాయి. హార్ట్ ఎటాక్‌తో అధిక శాతం మంది చనిపోతున్నారు. ఇందుకు ఆహారపు అలవాట్లు, జీవన విధానంలోని మార్పులే కారణమని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. దీంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి బీపీ పెరుగుతుంది. ఫలితంగా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఇలా చాలా మందికి జరుగుతోంది. కనుక జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
శరీరలో హై కొలెస్ట్రాల్ ఉంటే మనకు ముందుగానే కొన్ని సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి. వీటితో ఎవరైనా సరే అలర్ట్ కావచ్చని వైద్యులు చెబుతున్నారు. వీటిని ముందుగానే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలోని రక్తంలో ఉండే ఒక కొవ్వు లాంటి పదార్థం. మన శరీరానికి కొలెస్ట్రాల్ అవసరమే. కానీ అది మోతాదుకు మించి మరీ ఎక్కువగా ఉంటే మాత్రం అనర్థాలు సంభవిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే రక్తనాళాల్లో అది పేరుకుపోతుంది. దీంతో అది హార్ట్ ఎటాక్‌ను కలగజేస్తుంది.
ఛాతిలో నొప్పి..
శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఒక మోస్తరుకు మించి ఉంటే పెద్దగా లక్షణాలు ఏమీ కనిపించకపోవచ్చు. కానీ కొలెస్ట్రాల్ లెవల్స్ మరీ ఎక్కువగా ఉంటే మాత్రం పలు లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. హై కొలెస్ట్రాల్ లెవల్స్ ఉంటే ఛాతిలో నొప్పిగా ఉంటుంది. ఛాతిపై ఏదో బరువు పెట్టినట్లు అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందిగా అనిపిస్తుంది. కనుక ఈ లక్షణం ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి.
కళ్ల కింద పసుపు ఛాయలు..
ఇక ఎలాంటి కారణం లేకపోయినా కొందరికి అరిచేతులు, అరికాళ్లు ఎప్పుడూ చల్లగా ఉంటాయి. ఇలా గనక జరుగుతుంటే వారిలో కొలెస్ట్రాల్ మరీ ఎక్కువగా ఉందని అర్థం. అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే శరీరంలో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి కణాలకు సరిగ్గా ఆక్సిజన్ లభించదు. దీంతో తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. అదేవిధంగా కొలెస్ట్రాల్ లెవల్స్ మరీ ఎక్కువగా ఉంటే కళ్ల కింద భాగంలో పసుపు రంగులో ఛాయలు కనిపిస్తాయి. అలాగే బీపీ కూడా పెరుగుతుంది. కనుక ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటే డాక్టర్ మందులను ఇస్తారు.
జీవనశైలిలో మార్పులు అవసరం..
డాక్టర్ ఇచ్చే మందులను వాడడంతోపాటు జీవనశైలిలోనూ మార్పులను చేసుకుంటే హై కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఇందుకుగాను రోజూ తగినంత నిద్రపోవడంతోపాటు రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లను అయినా తాగాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని వేళకు తీసుకోవాలి. మద్యం మానేయాలి. పొగ తాగకూడదు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. చక్కెర, నూనె పదార్థాలను తినకూడదు. శీతల పానీయాలను తాగడం మానేయాలి. ఈ విధంగా జాగ్రత్తలను పాటిస్తే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. లేదంటే హార్ట్ ఎటాక్ బారిన పడి ప్రాణాలను కోల్పోతారు. కనుక అందరూ తమ ఆరోగ్యం పట్ల కచ్చితంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.