మూర్ఛ వ్యాధి… చిన్నా, పెద్దా… ఆడ, మగ తేడా లేకుండా ఈ వ్యాధి వస్తుంది. ఇది రావడానికి కారణాలు ఏమున్నా మూర్ఛ వచ్చి ఫిట్స్‌తో కొట్టుకుంటుంటే మాత్రం అప్పుడు ఆ వ్యక్తి నోట్లో నుంచి నురగ వస్తుంది. అన్ని సందర్భాల్లోనూ ఇలా ఉండకపోవచ్చు. కానీ నురగ వచ్చిందంటే మూర్ఛ రోగమనే అనుమానించాలి. అలాంటి సందర్భాల్లో కొందరు అపస్మారక స్థితిలోకి కూడా వెళ్తారు. అయితే అలా మూర్ఛ వచ్చిన వ్యక్తుల చేతిలో మన పూర్వీకులు ఇనుముతో చేసిన తాళాలు లేదంటే ఐరన్ రాడ్‌లను పెట్టడం చేస్తారు. దీంతో మూర్ఛ ఆగుతుందని వారి భావన. అయితే ఇందులో నిజమెంత..? నిజంగా అలా ఇనుప తాళాలు, రాడ్‌లను పెడితే మూర్ఛ ఆగుతుందా..? ఫిట్స్ ఆగిపోతాయా..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
మూర్ఛ వచ్చినప్పుడు ఆ వ్యక్తుల చేతిలో ఇనుప తాళాలు, రాడ్లను పెట్టడంపై చాలా మంది వైద్యులు ఏం చెబుతున్నారంటే… అది ఎంత మాత్రం ప్రభావం చూపిందట. మూర్ఛను ఆపే శక్తి ఇనుప తాళాలు, రాడ్లకు, ఇతర ఇనుప వస్తులకు ఉండదట. అయితే ఎప్పుడు, ఎవరికి మూర్ఛ వచ్చినా అది 2 నుంచి 5 నిమిషాల లోపే ఉంటుంది. ఆ లోపు వారంతట వారే సాధారణ స్థితికి వచ్చేస్తారట. ఈ క్రమంలో వారి చేతిలో ఇనుప తాళాలు, రాడ్లను పెట్టినా, పెట్టకున్నా ఫలితం ఉండదని, అయితే అలా పెట్టినా, ఎలాగూ కొంత సేపటికి సాధారణ స్థితికి చేరుకుంటారు కనుక, చాలా మంది ఇనుప వస్తువులు పనిచేశాయని భావిస్తారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదంటున్నారు న్యూరో సర్జన్ నిపుణులు.
అయితే మూర్ఛ వచ్చినప్పుడు అలాంటి వ్యక్తుల పట్ల కొన్ని జాగ్రత్తలు మాత్రం కచ్చితంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అవేమిటంటే… మూర్ఛ వచ్చిన రోగిని నేలపై పడుకోబెట్టాలి. ఫిట్స్‌తో కొట్టుకుంటూ అటు ఇటు బాగా వేగంగా కదిలినా, కదలనివ్వాలి. కానీ వారి చర్యలను ఆపకూడదు. ఒక వేళ ఆపితే వారికి సడెన్ అటాక్ వచ్చేందుకు అవకాశం ఉంటుందట. అదేవిధంగా మూర్ఛ వచ్చిన రోగి నోట్లో ఎలాంటి వస్తువులను పెట్టకూడదు. వాంతికి అయితే చేసుకోనివ్వాలి. తగినంత గాలి ఆడేలా చూడాలి. వెంటనే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి.