Gastric Problem : మనల్ని వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో గ్యాస్ట్రైటిస్ కూడా ఒకటి. ఈ సమస్యతో మనలో చాలా మందిని వేధిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో ఇది కూడా ఒకటి. జీర్ణాశయం పొరల్లో ఏదైనా ఇన్ ప్లామేషన్ ఏర్పడితే ఆ స్థితినే గ్యాస్ట్రైటిస్ అంటారు. ఈ సమస్య తలెత్తడానికి వివిధ కారణాలు ఉంటాయి. ఎక్కువగా మందులను వాడడం, ధూమపానం, మధ్యపానం, విటమిన్ బి12 లోపం వల్ల, అలాగే హెచ్ ఫైలోరి అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా, అలాగే ఒత్తిడి, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, మసాలా, కారం కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల, పచ్ఛళ్లను ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.
అలాగే ఎక్కువగా తినే వారిలో, రాత్రి పూట ఆలస్యంగా తినేవారిలో, త్వర త్వరగా భోజనం చేసే వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారిలో కడుపులో నొప్పి, కడుపు మంట, గుండెలో మంట, ఛాతి నొప్పి,అజీర్తి, పుల్లటి త్రేన్పులు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య తలెత్తగానే ముందుగా వైద్యున్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. గ్యాస్ట్రైటిస్ సమస్య మనం తీసుకునే ఆహారం కారణంగా వచ్చిందా లేదా వైరస్ ఇన్పెక్షన్ వల్ల వచ్చిందా గుర్తించాలి. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన వారు వైద్యుని సూచన మేరకు యాంటీ బ్యాక్టీరియల్ మందులను వాడాల్సి ఉంటుంది. అదే మనం తీసుకునే ఆహారం ద్వారా ఈ సమస్య తలెత్తితే మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడే వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈసమస్యతో బాధపడే వారు, కారం, మసాలా ఉన్న ఆహారాలను, ఉప్పు, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలను, జంక్ పుడ్ ను తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి. అలాగే నిమ్మజాతికి చెందిన పండ్లను తీసుకోవడం తగ్గించాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఒత్తిడిని వీలైనంత వరకు మన దరి చేరకుండా చూసుకోవాలి. ఆకుకూరలు, బీరకాయ, సొరకాయ, పొట్ల కాయ, కాకరకాయ వంటి వాటిని తీసుకోవాలి. పాలు, పాల పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. పప్పు ధాన్యాలు, వాము, సోంపు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే ఆహారాన్ని సమయానికి బాగా నమిలి తీసుకోవాలి. ఈ ఆహార నియమాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా గ్యాస్ట్రైటిస్ సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.