Heart Attack : మన శరీరంలో నిరంతరం పని చేసే అవయవాల్లో గుండె ఒకటి. గుండె కొట్టుకుంటేనే మనం ప్రాణాలతో ఉండగలుగుతాము అని మనందరికి తెలిసిందే. గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ప్రాణాలతో ఉండగలుగుతాము. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. చాలా మందికి గుండె సమస్య ఉన్నట్టుగా కూడా తెలియదు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయి ప్రాణాలను కోల్పోతున్నారు. చాలా మంది హార్ట్ ఎటాక్ ఒకటే గుండెకు సంబంధించిన సమస్యగా భావిస్తూ ఉంటారు.
హార్ట్ ఎటాక్ కే కాకుండా గుండె కండరాలు గట్టిపడడం వల్ల పంపింగ్ కష్టమై గుండె నుండి వచ్చే రక్తం తగ్గడం అలాగే గుండెలో క్యాల్షియంతో పాటు ఇతర రకాల లవణాలు పేరుకుపోయి గుండె తలుపులు సరిగ్గా మూసుకోకపోవడం, అలాగే గుండె కొట్టుకునే శబ్దాల్లో తేడాలు రావడం, అలాగే గుండె తక్కువగా కొట్టుకోవడం అలాగే గుండె లోపల వివిధ రకాల శబ్దాలు, అలాగే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెకు రక్తసరఫరా తగ్గడం వంటి వివిధ రకాల సమస్యలు కూడా గుండెకు వస్తూ ఉంటాయి. మన జీవనశైలి మారడం, మారిన ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి వంటి వివిధ రకాల కారణాల చేత గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. గుండె జబ్బుల కారణంగా వయసుతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
గుండె జబ్బుల బారిన పడడానికి ప్రధాన కారణం నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, ఉప్పును ఎక్కువగా తీసుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు. నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తసరఫరాకు అడ్డంకులు ఏర్పడతాయి. అలాగే ఉప్పును తీసుకోవడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించే గుణాన్ని తగ్గిపోతాయి. దీంతో రక్తసరఫరా సాఫీగా సాగదు. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ సమస్య తలెత్తుతుంది. ఈ బీపీ కారణంగా గుండె కండరాలు బిగుసుకు పోతాయి. అలాగే ఉప్పును తీసుకోవడం వల్ల రక్తం చిక్కబడుతుంది. అలాగే గుండె సమస్యలకు మరో కారణం పంచదార మరియు పాలిష్ బట్టిన ఆహారాలను తీసుకోవడం. మైదా, రవ్వ, ఉప్పుడు రవ్వ వంటి వాటితో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ పదార్థాలు రక్తాన్ని చిక్కబడేలా చేస్తాయి.
అలాగే ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఈ కారణం చేత కూడా హార్ట్ ఎటాక్ లు ఎక్కువగా వస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే గుండెకు మేలు చేసే ఆహారాలను తీసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అవిసె గింజలు, వాల్ నట్స్, బాదం పప్పు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అలాగే ప్రకృతి ఇచ్చిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఫైబర్, ప్రోటీన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. అలాగే డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.
ఫ్రూట్స్, సలాడ్స్, జ్యూస్ లు, అన్ పాలిషిడ్ ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఆహారాలను మూడు వంతులు తీసుకోవాలి. వంటల్లో నూనె, ఉప్పు ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది. వీటితో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఉండాలి. అలాగే ప్రాణాయామం, ధ్యానం వంటివి చేయాలి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.