Honey : రోజూ మనం అనేక సందర్భాల్లో చక్కెరను తింటుంటాం. కాఫీ లేదా టీ.. పండ్ల రసాలు.. స్వీట్లు.. ఇలా మనం రోజూ అనేక రూపాల్లో చక్కెరను తీసుకుంటుంటాం. అయితే చక్కెరను అధికంగా తింటే మన శరీరానికి హాని కలుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. చక్కెర అధికమైతే అధికంగా బరువు పెరుగుతారు. షుగర్ వస్తుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కనుక చక్కెరకు బదులుగా తేనెను వాడాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే చక్కెర కన్నా తేనె ఎందుకు మంచిది ? ఇది కూడా తియ్యగానే ఉంటుంది కదా.. మరలాంటప్పుడు తేనె మనకు హాని ఎందుకు కలగజేయదు ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చక్కెరను చెరుకు రసం నుంచి తయారు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో చెరుకు రసంలో ఉండే పోషకాలు పోతాయి. పైగా సల్ఫర్ వంటి రసాయనాలను చక్కెర తయారీలో వాడుతారు. కనుక చక్కెర అనేది ఒక కృత్రిమ పదార్థం. కాబట్టి దీని వల్ల మనకు హాని కలుగుతుంది. దీని వల్ల షుగర్ రావడమే కాదు.. కిడ్నీలపై కూడా భారం పడుతుంది.
ఇక తేనె చాలా సహజసిద్ధంగా తయారవుతుంది. దీంట్లో ఎలాంటి రసాయనాలు కలవవు. ఇందులో ఉండేవి సహజసిద్ధమైన చక్కెరలు. ఇవి మన శరీరంలో త్వరగా కలిసిపోవు. నెమ్మదిగా కలుస్తాయి. కనుక షుగర్ ఉన్నవారు కూడా తేనెను తినవచ్చని చెబుతుంటారు. తేనెను అప్పటికప్పుడు సేకరించి నిల్వ చేస్తే ఎన్ని ఏళ్లు అయినా సరే అలాగే ఉంటుంది. చెడిపోదు. తేనె మన శరీరానికి పోషకాలు, శక్తిని అందిస్తుంది. కానీ చక్కెర కేవలం శక్తిని మాత్రమే అందిస్తుంది. క్యాలరీలు అధికంగా ఉంటాయి. తేనె అలా కాదు.. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. కనుక చక్కెర కన్నా తేనె ఎన్నో విధాలా ఉత్తమమైంది. కాబట్టి ఎవరైనా సరే చక్కెరకు బదులుగా తేనెను వాడితే.. ఓవైపు పోషకాలు.. మరోవైపు శక్తి.. ఇంకోవైపు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి చక్కెరకు బదులుగా తేనెనే వాడండి..!