అధిక బరువు అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. దాన్ని తగ్గించుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే చాలా మంది తమ ఎత్తుకు తగిన బరువు ఉండడం లేదు. ఎక్కువగానే బరువు ఉంటున్నారు. ఈ క్రమంలో అసలు ఎవరైనా సరే ఎంత ఎత్తు ఉంటే బరువు ఎంత వరకు ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
* మీ ఎత్తు 4 అడుగుల 10 అంగుళాలు అయితే మీ శరీర బరువు 41 నుంచి 52 కిలోల మధ్య ఉండాలి.
* మీ ఎత్తు 5 అడుగులు ఉంటే మీ శరీర బరువు 44 నుంచి 55.7 కిలోల మధ్య ఉండాలి.
* మీ ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు ఉంటే మీ శరీర బరువు 49 నుంచి 63 కిలోల మధ్య ఉండాలి.
* ఎత్తు 5 అడుగుల 4 ఇంచులు ఉంటే బరువు 49 నుంచి 63 కిలోల మధ్య ఉండాలి.
* ఎత్తు 5 అడుగుల 6 ఇంచులు ఉంటే బరువు 53 నుంచి 67 కిలోల మధ్య ఉండాలి.
* ఎత్తు 5 అడుగుల 8 ఇంచులు ఉంటే బరువు 56 నుంచి 71 కిలోల మధ్య ఉండాలి.
* ఎత్తు 5 అడుగుల10 ఇంచులు ఉంటే బరువు 59 నుంచి 75 కిలోల మధ్య ఉండాలి.
* ఎత్తు 6 అడుగులు ఉంటే బరువు 63 నుంచి 80 కిలోల మధ్య ఉండాలి.
పైన తెలిపిన బరువు కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని స్థూలకాయం అంటారు. ఇక ఆ బరువు కన్నా తక్కువగా కూడా ఉండరాదు. కచ్చితంగా ఆ రేంజ్‌లో బరువును మెయింటెయిన్ చేయాలి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.